iDreamPost

దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం.. తరలి వస్తోన్న భక్తులు

  • Published Nov 17, 2023 | 9:41 AMUpdated Nov 17, 2023 | 10:09 AM

శివకేశవులకు ఎంతో పీతిపాత్రమైన మాసం కార్తీకం. ఇటువంటి విశేషమైన సమయంలో.. జనాల్లో దాగున్న ఆధ్యాత్మిక భావనలను బయటకు తీసుకురావడమే కాక మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు నిర్వహిస్తోన్న గొప్ప కార్యక్రమమే కోటీ దీపోత్సవం. దానికి సంబంధించిన వివరాలు...

శివకేశవులకు ఎంతో పీతిపాత్రమైన మాసం కార్తీకం. ఇటువంటి విశేషమైన సమయంలో.. జనాల్లో దాగున్న ఆధ్యాత్మిక భావనలను బయటకు తీసుకురావడమే కాక మన సంస్కృతి, సంప్రదాయాలను భావి తరాలకు అందించేందుకు నిర్వహిస్తోన్న గొప్ప కార్యక్రమమే కోటీ దీపోత్సవం. దానికి సంబంధించిన వివరాలు...

  • Published Nov 17, 2023 | 9:41 AMUpdated Nov 17, 2023 | 10:09 AM
దిగ్విజయంగా కొనసాగుతున్న భక్తి టీవీ కోటి దీపోత్సవం.. తరలి వస్తోన్న భక్తులు

కార్తీక మాసం అనగానే దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తుంది. శివకేశవులకు ఎంతో ప్రీతిపాత్రమైంది ఈ కార్తీక మాసం. ఆలయాలన్ని దీపాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోతాయి. ఇక గత కొన్నేళ్లుగా కార్తీక మాసం ప్రారంభం కాగానే హైదరాబాద్‌లో కోటీ దీపోత్సవం కార్యక్రమం జరుగుతుంది. న్యూస్‌ చానెల్‌ ఎన్టీవీ, భక్తిటీవీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా రచనా టెలివిజన్‌ ప్రతీ ఏటా ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే.

దీనిలో భాగంగా ఈ ఏడాది కూడా ఎన్టీఆర్‌ స్టేడియంలో కోటి దీపోత్సవం కార్యక్రమం మొదలయ్యింది. ఆ మహా దీపయజ్ఞం ప్రస్తుతం దిగ్విజయంగా ప్రజ్వరిల్లుతోంది. భక్తి టీవీ, ఎన్టీవీ ఆధ్వర్యంలో 14 రోజుల పాటు జరిగే గొప్ప ఆధ్యాత్మిక కార్యక్రమం ఇది. శివకేశవులని ఒకేవేదికపై కోటీదీపాల మధ్య దర్శించుకునే యోగమే కోటి దీపోత్సవం. జనం గుండె లోతుల్లో దాగిన భక్తిభావాలను వెలికి తీసే పవిత్రప్రయోగమే ఈ కోటిదీపోత్సవం.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుంచి పీఠాధిపతులు, మహాయోగులు, ఆధ్యాత్మికవేత్తలు తరలి వస్తారు. వారి ప్రవచనామృతంతో మొదలై, ప్రత్యేక అర్చనలతో పవిత్రత సంతరించుకుని, దేవదేవుల కళ్యాణ మహోత్సవాలు, లింగోద్భవం, నీరాజనాలతో భక్తులకు నిండైన ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచే మహోత్సవమే ఈ దీపోత్సవం. ఈ సందర్భంగా నిర్వహించే ఉత్సవ విగ్రహాల ఊరేగింపు చూసి తరలించాల్సిందే తప్ప వర్ణించడానికి మాటలు లేవు. తిరుమల, యాదగిరిగుట్ట సింహాచలం, భద్రాచలం, కాళేశ్వరం, శ్రీకాళహస్తి, వేములవాడ, బెజవాడలాంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల దేవతామూర్తులను చూసి భక్తకోటి పులకించిపోయే అద్భుత దృశ్యం ఈ కోటిదీపోత్సవంలో ప్రతిరోజూ సాక్షాత్కారమవుతుంది.

కోటీ దీపోత్సవం కార్యక్రమంలో ముఖ్య ఘట్టం.. ఒక్కసారిగా ప్రజ్వలించే కోటీ దీపాలు. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం గురించి ఎంత వర్ణించినా తక్కువే. ‘‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే’’ అంటారు. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుందని నమ్మకం. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రముఖ్యం ఉంది.

మన సంస్కృతికి సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మ వంటిది. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా 2013 నుంచి భక్తి టీవీ.. కోటిదీపోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తుంది. దానిలో భాగంగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 14 మంగళవారంతో ప్రారంభమై.. నవంబర్ 27 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపుల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి