iDreamPost

కొత్త ప్రపోజల్.. సినిమా రిలీజైన 48 గంటల తర్వాతే రివ్యూలట!

Reviews Posting- High Court Amicus Curiae: సినిమా నిర్మాతలకు రివ్యూవర్లకు ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంటారు. ఇకపై అలాంటి ఆస్కారం లేకుండా పోతుంది అంటున్నారు.

Reviews Posting- High Court Amicus Curiae: సినిమా నిర్మాతలకు రివ్యూవర్లకు ఎప్పుడు ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంటుంది. కావాలనే నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు అంటారు. ఇకపై అలాంటి ఆస్కారం లేకుండా పోతుంది అంటున్నారు.

కొత్త ప్రపోజల్.. సినిమా రిలీజైన 48 గంటల తర్వాతే రివ్యూలట!

గత కొన్నేళ్లుగా నిర్మాతలకు రివ్యూవర్లకు ఒక పరోక్ష యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. కొందరు కావాలని తమ సినిమాలకు నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు అంటూ చాలామంది నిర్మాతలు కామెంట్స్ చేశారు. అలాగే హీరోలు కూడా తమ సినిమాలను నెగిటివ్ చేస్తున్నారు అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం చూశాం. ఇటీవల విశ్వక్ సేన్ కూడా కొందరు పనిగట్టుకుని నెగిటివ్ ప్రచారం చేశారంటూ చేసిన కామెంట్స్ అందరికీ తెలుసు. అయితే ఇది ఒక్క టాలీవుడ్ సమస్య మాత్రమే కాదు. పాన్ ఇండియా లెవల్లో జరుగుతున్నదే. ఇప్పుడు ఈ సమస్యకు కేరళ హైకోర్టు ఒక పరిష్కారం కనుగొన్నట్లు తెలుస్తోంది.

సాధారణంగా ఇండస్ట్రీ ఏదైనా నిర్మాతలు, ఆర్టిస్టులు ఎప్పుడూ రివ్యూవర్స్, క్రిటిక్స్ మీద ఒకింత అసహనం, ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉంటారు. కావాలని మా సినిమాకి తక్కువ రేటింగ్ ఇచ్చారని, కావాలని మా మూవీని నెగిటివ్ చేస్తున్నారని అన్ని ఇండస్ట్రీస్ లో ఉన్న ప్రముఖులు కామెంట్స్ చేయడం చూశాం. అలాగే కేరళలో కూడా ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తూనే ఉంది. ఒక అజ్ఞాత వ్యక్తి కేరళ హైకోర్టును ఇదే విషయంపై ఆశ్రయించారు. ఆ పిటిషన్ నేపథ్యంలో కేరళ హైకోర్టు అమికస్ క్యూరీని అపాయింట్ చేసింది. అసలు ఈ రివ్యూల వల్ల లాభమా? నష్టమా? సాధ్యాసాధ్యాలు? వాటి ప్రభావం? ఇలా అన్ని అంశాలపై కూలంకషంగా పరిశోధన చేయాలని ఆదేశించారు.

అమికస్ క్యూరీ శ్యామ్ పద్మన్ తన ఫైండింగ్స్ ని, తన సూచనలను కేరళ హైకోర్టుకు సమర్పించారు. ఆయన చేసిన సూచనలు ఏంటంటే.. సినిమా విడుదలైన 48 గంటల తర్వాతే రివ్యూలు, ఇన్ ఫ్లుఎన్సర్స్ అభిప్రాయాలను పోస్ట్ చేయాలని సూచించారు. ఈ రివ్యూవర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ అభిప్రాయాలు సినిమాలపై ప్రభావం చూపుతాయని, అలాంటి వారు ఒక్కోసారి కావాలనే నెగిటివ్ చేసే ఆస్కారం కూడా ఉందంటూ తెలియజేశారు. అందుకే ఆడియన్స్ పై రివ్యూల ప్రభావం లేకుండా ఉడేందు.. 48 గంటల తర్వాతే రివ్యూలు పోస్ట్ చేయడం మంచిదంటూ శ్యామ్ పద్మన్ చెప్పారు. అలాగే రివ్యూల పేరిట జరిగే విషయాలను కూడా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎప్పుడైతే నిర్మాతలు రివ్యూ కోసం డబ్బులు చెల్లించరో అలాంటి సమయంలో కూడా కావాలనే నెగిటివ్ రివ్యూలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తారంటూ చెప్పుకొచ్చారు.

కావాలని నెగిటివ్ చేసే ‘రివ్యూ బాంబింగ్’ని అరికట్టాలి అంటే దాని కోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్స్ ఉండాలని చెప్పారు. ఒకవేళ నిజంగానే ఎవరైనా కావాలని నెగిటివ్ రివ్యూ ఇస్తే.. దానిపై ఫిర్యాదు చేసేందుకు ఆవకాశం కల్పించాలని సూచించారు. అలాగే రివ్యూవర్లు సమీక్షలో సరైన భాషను మాత్రమే వాడాలని చెప్పారు. తక్కువ చేసి మాట్లాడటం, చులకన చేయడం, చిత్రబృందం- తారలపై వ్యక్తిగత దూషణలకు ఆస్కారం లేకుండా చూడాలని రిపోర్ట్ లో కోరారు. కోరళ హైకోర్టు కూడా అమిస్ క్యూరీ రిపోర్టు ఆవశ్యకతను గుర్తించింది. సాధ్యమైనంత త్వరగా కేరళ రాష్ట్రంలో ఈ రిపోర్టుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే ఆస్కారం లేకపోలేదు. ఇకపై కేరళలో సినిమా రిలీజ్ అయిన 48 గంటల తర్వాతే రివ్యూలు, అభిప్రాయాలు వచ్చే ఆస్కారం కనిపిస్తోంది. మరి.. కేరళ హైకోర్టు అమికస్ క్యూరీ రిపోర్టుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి