కోలుకుంటున్న కపిల్ దేవ్

By Kiran.G Oct. 24, 2020, 11:31 am IST
కోలుకుంటున్న కపిల్ దేవ్

ఛాతినొప్పి కారణంగా హాస్పిటల్లో చేరిన టీమిండియా మాజీ క్రికెట్ కెప్టెన్ కపిల్‌దేవ్‌ క్రమంగా కోలుకుంటున్నారు. వైద్యులు కపిల్‌దేవ్‌కు యాంజీయోప్లాస్టీ చికిత్స అందించి ఐసీయూలో ఉంచిన విషయం తెలిసిందే. కాగా ఆయన వేగంగా కోలుకుంటున్నట్లు మరో రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ కానున్నట్లు వైద్యులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే మాజీ క్రికెటర్ చేతన్ శర్మ యాంజీయోప్లాస్టీ ఆపరేషన్ నిర్వహించిన అనంతరం నవ్వుతూ కోలుకుంటున్న కపిల్ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేశారు. ఆపరేషన్ తరువాత కపిల్ దేవ్ బాగున్నారని వెల్లడించారు. దీంతో క్రీడాభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కపిల్ కూడా తను కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతీ ఒక్కరికీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. తాను మరో రెండు రోజుల్లో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా ఇండియాకు తొలి ప్రపంచకప్ అందించిన కెప్టెన్ గా లెజెండరీ ఆల్ రౌండర్ గా ప్రసిద్ధిగాంచిన కపిల్ దేవ్ అస్వస్థతకు గురయ్యారన్న వార్త విని ఆయన అభిమానులు టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ అభిమాన ఆటగాడు‌ త్వరగా కోలుకుని, క్షేమంగా తిరిగి రావాలని అందరూ ఆకాంక్షించారు. మరో రెండు రోజుల్లో హర్యానా హరికేన్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతారని తెలియడంతో పలువురు ఆనందం వ్యక్తం చేశారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp