WT20 Ind Vs Pak : టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య సమరం కాసేప‌ట్లోనే.

By iDream Post Oct. 24, 2021, 02:46 pm IST
WT20 Ind Vs Pak  : టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య సమరం కాసేప‌ట్లోనే.
టీమిండియా, పాకిస్తాన్‌ మధ్య సమరం కాసేప‌ట్లోనే. టి20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభం నుంచీ అందరి కళ్లు భారత్‌- పాక్‌ మ్యాచ్‌పైనే. సూప‌ర్ సండే హై వోల్టేజ్‌గా సాగే ఈ మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారు? ఎక్కువ‌మంది ఫేవ‌రేట్ ఇండియానే. అలాగ‌ని పాకిస్తాన్ ని తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని కొంద‌రి మాట‌. గ‌తంతో పోలిస్తే ఇప్ప‌టి పాక్ బౌలింగ్ లో మెరుగుప‌డింది. నిల‌క‌డ నేర్చుకుంది. టాప్ ఆర్డ‌ర్ సాలిడ్ గా మారింది. నిజానికి, వన్డే ప్రపంచకప్‌లలో పాక్‌పై 7-0, టి20 ప్రపంచకప్‌లలో 5-0తో టీమిండియా మెరుగ్గా ఉంది. ఇది 6-0కి పెరుగ‌బోతోంద‌ని ఇండియా న‌మ్ముతోంది. ఈ సూప‌ర్ సండే మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తారు? ఇండియా పాక్ బ‌లాబ‌లాల‌పై మాజీ క్రికెట‌ర్లు వేణుగోపాల్ రావు, క‌ళ్యాణ్ ల‌తో ఐడ్రీమ్ న్యూస్ విశ్లేషించింది. అంద‌రికీ తెలిసిన ప్ర‌జెంట‌ర్, క్రికెట్ కామెంటేట‌ర్ శ‌శి విశ్లేష‌ణ నిర్వ‌హించారు. వాచ్
idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp