మ్యాచ్‌ విన్నింగ్ ఆల్‌రౌండర్‌లే లేరా?పఠాన్‌కు యువీ ప్రశ్న

By Srinivas Racharla Jul. 23, 2020, 08:30 am IST
మ్యాచ్‌ విన్నింగ్ ఆల్‌రౌండర్‌లే లేరా?పఠాన్‌కు యువీ ప్రశ్న

భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్‌ని ట్విట్టర్ వేదికగా ప్రశంసిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.అయితే పఠాన్ వ్యాఖ్యలను మరో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ప్రశ్నించడం సంచలనంగా మారింది.

సోమవారం ముగిసిన రెండో టెస్టులో వెస్టిండీస్‌పై ఇంగ్లండ్ విజయంలో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ కీలకపాత్ర పోషించాడు.తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులు చేసిన స్టోక్స్,రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా ఆడి 78 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ టెస్టులో 256 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు పడగొట్టాడు.

అద్భుతంగా రాణించిన బెన్‌స్టోక్స్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురిపిస్తూ,"బెన్‌స్టోక్స్ వంటి మ్యాచ్ విన్నింగ్ ఆల్‌రౌండర్ భారత జట్టులో ఉంటే టీమిండియాకు తిరుగుండదు.ప్రపంచంలో భారత్‌ను ఓడించడం ఏ జట్టు కైనా అసాధ్యంగా మారుతుంది" అని ట్వీట్ చేశాడు.


అయితే ఇర్ఫాన్ ట్వీట్‌పై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.అంటే భారత జట్టులో మ్యాచ్‌లు గెలిపించగల ఆల్‌రౌండర్‌ లేరని నీ ఉద్దేశ్యమా...? అని పఠాన్‌ని ప్రశ్నించాడు.

కాగా మాజీ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్‌ యువరాజ్ సింగ్ ప్రశ్నకు ఇబ్బందిపడ్డ పఠాన్ తెలివిగా జవాబిచ్చాడు. 'సోదరా! భారత్‌లో యువరాజ్ సింగ్ ఉండేవాడు..కానీ ఆయన అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు' అని చమత్కరించాడు. ఇందుకు యువీ స్పందిస్తూ ' నాకు తెలుసు నీ నుంచి ఇలాంటి సమాధానం వస్తుంది'అని బదులిచ్చాడు. దీనికి మరల పఠాన్ 'నాగురించి నీకు బాగా తెలుసు బ్రదర్'అంటూ కామెంట్ చేశాడు.

తాజాగా భారత మాజీ ఆల్‌రౌండర్ల మధ్య జరిగిన ట్విటర్ చాటింగ్ వైరల్‌గా మారడం గమనార్హం.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp