రాజస్థాన్ గెలుపుకి ఢిల్లీ కెప్టెన్ హెల్ప్ చేసాడా...? ఆ రెండు ఘటనలు ఏం చెప్పాయి...?

By Guest Writer Apr. 16, 2021, 01:11 pm IST
రాజస్థాన్ గెలుపుకి ఢిల్లీ కెప్టెన్ హెల్ప్ చేసాడా...? ఆ రెండు ఘటనలు ఏం చెప్పాయి...?

ఐపిఎల్ అనేది ఒక మాయా ప్రపంచం... ఐపిఎల్ అర్ధమైన వాళ్ళు కార్తీక దీపం సీరియల్ కు ప్రాధాన్యత ఇస్తారని అర్ధం కాని వాళ్ళు ఇంగ్లీష్ సినిమా మాదిరి ఏదో జరుగుతుంది అన్నట్టు చూస్తారని మనం కామెంట్స్ చూస్తూ ఉంటాం. గతంలో క్రికెట్ లో ఏది జరిగినా నిజంగా జరిగింది అనుకునే ఫాన్స్ ఇప్పుడు క్రికెట్ లో ఏది జరిగినా... తల గోక్కుంటూ వాడు నిజంగానే అవుట్ అయ్యాడు అంటావా బావా అంటూ నిష్టూరంగా మాట్లాడుతున్నారు.

వాళ్ళ నిష్టూరానికి చాలా కారణాలు ఉన్నాయి గాని... ఇప్పుడు మనం ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ వ్యవహారశైలి గురించి మాట్లాడుకుందాం. బాబు రన్ అవుట్, కీపింగ్ గురించి జనాలకు లేనిపోని డౌట్ లు మొదలయ్యాయి. అసలు మేటర్ ఏంటో చూద్దాం. ఢిల్లీ ఓడిపోవడానికి కెప్టెన్ కారణం అయ్యాడని ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. ముంబైలో గురువారం జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ ముందు బ్యాటింగ్ చేసింది.

ఓపెనర్లతో పాటు కీలక ఆటగాళ్ళు తక్కువ స్కోర్ కి అవుట్ అయినా రిషబ్ పంత్ మాత్రం నిలబడ్డాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ బుడ్డి గిల్ క్రిష్ట్. 32 బంతుల్లో 51 పరుగులు చేసాడు. లలిత్ యాదవ్ తో టామ్ కరన్ తో కలిసి మంచి బ్యాటింగ్ చేసాడు. అయితే లేని పరుగు కోసం ట్రై చేసాడు. పరాగ్ బౌలింగ్ లో లేని పరుగు ట్రై చేసాడు. బంతి బౌలర్ చేతిలోకి నేరుగా వెళ్ళింది... ఈ విషయం అందరికి అర్ధమైంది. కాని పరుగు తీసాడు.

డైరెక్ట్ గా పరాగ్ త్రో వేయడంతో పంత్ ఇన్నింగ్స్ ముగిసింది. కాసేపు పంత్ ఉండి ఉంటే ఢిల్లీ మంచి స్కోర్ చేసేది. ఇక రాజస్థాన్ ని కట్టడి చేసే విషయంలో పాంటింగ్ సలహాలతో జాగ్రత్తగా వెళ్ళిన పంత్... గెలిచే వరకు మ్యాచ్ ని తీసుకువెళ్ళి నాశనం చేసాడు. క్రిస్ మోరిస్ రాజస్తాన్ తరుపున బాగానే ఆడి... హిట్టింగ్ చేసాడు. ఇక జయదేవ్ ఉనడ్కత్... చివర్లో మెరిపించాడు. 18 బంతుల్లో 34 పరుగులు చేయాలి రాజస్థాన్ టీం.

క్రిస్ మోరిస్ బంతిని బలంగా హిట్టింగ్ చేసాడు. అది నేరుగా ఢిల్లీ ఫీల్డర్ మార్కస్ స్టోయినిస్ వద్దకు వెళ్ళింది. సింగిల్ తర్వాత మోరిస్ నాన్ స్ట్రైకర్ గా ఉన్నాడు. కాని... ఉనడ్కట్ మాత్రం పరుగు తీసాడు. మోరిస్ వద్దని చెప్పడంతో ఉనడ్కట్ పిచ్ మధ్యలో జారి పడ్డాడు. ఆ సమయంలో స్టోయినిస్... పంత్ కి బంతి విసరగా... రన్ అవుట్ చేసే అవకాశం వచ్చినా... పంత్ చేసిన పొరపాటుతో... చేతిలో పడిన బంతి బయటకు వచ్చేసింది.

కాని చేతులు మాత్రం వికెట్లను గిరాటేసాయి. థర్డ్ అంపైర్ దాన్ని నాట్ అవుట్ అని చెప్పాడు. రెండు బంతులు మిగిలి ఉండగా రాజస్థాన్ గెలిచింది. ఆ రన్ అవుట్ జరిగి ఉంటే ఢిల్లీ చేతిలో మ్యాచ్ ఉండేది. అప్పటికే ఏడు వికెట్ లు పడ్డాయి కూడా. కాని ఉనడ్కట్ సపోర్ట్ తో మోరిస్ రెచ్చిపోయాడు. దీనితో పంత్ కావాలనే రాజస్థాన్ ని గెలిపించాడని, భారీ స్కోర్ చేసే టైం లో రన్ అవుట్ అయ్యాడని, కీలక రన్ అవుట్ ని వదిలేసాడని ఇది ఫిక్సింగ్ అని అంటున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు. ఏమో లే మనకేం తెలుసు. టైం అవుట్ మాయ అయి ఉంటది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp