టీమిండియా పేస్‌ దళానికి బుమ్రానే నాయకుడు -మార్కస్‌ లబూషేన్

By Srinivas Racharla Jul. 20, 2020, 07:45 pm IST
టీమిండియా పేస్‌ దళానికి బుమ్రానే నాయకుడు -మార్కస్‌ లబూషేన్

భారత యార్కర్‌ల మాంత్రికుడు జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్ గురించి ఆసీస్‌ యువ బ్యాట్స్‌మన్‌ మార్కస్‌ లబూషేన్‌ సంచలన అంశాలు వెల్లడించాడు.ఇంకా ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించనున్న నేపథ్యంలో లబూషేన్‌ పలు ఆసక్తికర విషయాలు ప్రస్తావించాడు.

బ్రిస్బేన్‌లో పీటీఐకి ఇచ్చిన ఇంటర్య్వూలో మార్నస్‌ లబుషేన్‌ మాట్లాడుతూ "గంటకు 140 కి.మీల వేగంతో నిలకడగా బౌలింగ్‌ చేయగల సత్తా బుమ్రాకు ఉంది. పరిస్థితులు అనుకూలిస్తే బంతిని ఇరువైపులా స్వింగ్‌ చేయడంలో కూడా బుమ్రా దిట్ట.అందుకే బుమ్రా బౌలింగ్‌లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.ఇక భారత్‌ పేస్‌ దళం చాలా బలంగా తయారైంది.అందులో బుమ్రా ప్రమాదకర బౌలర్‌. నీకు నువ్వు బ్యాట్స్‌మన్‌గా పరీక్షించుకోవాలంటే అతని బౌలింగ్‌ను ఆడితేనే నీలో సత్తా బయటికొస్తుంది. టీమిండియా పేస్‌ దళానికి బుమ్రానే నాయకుడు అనడంలో ఎటువంటి సందేహం లేదు" అని బుమ్రాపై ప్రశంసల జల్లు కురిపించాడు.

ఆసీస్-భారత్ సిరీస్‌ గురించి తన అనుభవాన్ని లబూషేన్‌ తెలుపుతూ "నేను భారత్‌లో ఒకే ఒక టెస్టు మ్యాచ్‌ ఆడాను.గతంలో సిడ్నీ మ్యాచ్‌లో భారత్‌తో ఓ మ్యాచ్‌ ఆడా.నాకు భారత్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో పెద్దగా అనుభవం లేదు.ఈ ఏడాది ఆరంభంలో పరిమిత ఓవర్ల సిరీస్‌ ఆడటానికి భారత్‌లో పర్యటించాను.కాగా టెస్టుల పరంగా చూస్తే భారత్‌ బౌలింగ్‌ను చాలా తక్కువగానే ఆడాను.ప్రస్తుతం టీమిండియా పేస్‌ బౌలింగ్‌ దళంలో సీనియర్ బౌలర్ ఇషాంత్‌ శర్మ కూడా రాణిస్తున్నాడు.ఆసీస్‌ గడ్డపై అతనికి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది.ఇషాంత్ నుంచి కూడా కంగారూ బ్యాట్స్‌మన్‌లకు ప్రమాదం పొంచి ఉంది.రాబోయే సిరీస్‌లో భారత్ నుంచి ఆసీస్‌కి గట్టిపోటీ ఎదుర్కొనక తప్పదు" అని అభిప్రాయపడ్డాడు.

సుదీర్ఘ కాలంగా ఒకటి కన్నా ఎక్కువ ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్,ఆసీస్‌ కెప్టెన్ స్టీవ్ స్మిత్,ఇంగ్లడ్ టెస్టు కెప్టెన్ జో రూట్‌లు నిలకడగా రాణిస్తున్నారు.ఆధునిక క్రికెట్‌లో అగ్రశ్రేణి బ్యాట్స్‌మన్‌లుగా కీర్తింప బడుతున్న వారిని స్ఫూర్తిగా తీసుకొని అన్ని ఫార్మాట్లలో రాణించేందుకు ప్రయత్నిస్తానని లబూషేన్‌ ప్రకటించాడు.
ఇటీవల బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తూ లబూషేన్‌ ఆసీస్‌ జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా స్థానం సంపాదిస్తున్నాడు.ఇప్పటివరకూ 14 టెస్టు మ్యాచ్‌లు ఆడిన లబూషేన్‌ 63 పైగా సగటుతో 1459 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp