భారత్ మదిలో గుబులు రేపుతున్న గత రికార్డులు

By Srinivas Racharla Jan. 14, 2020, 01:26 pm IST
భారత్ మదిలో గుబులు రేపుతున్న గత రికార్డులు

కొద్ది సేపట్లో   ముంబై లోని వాంఖడే వేదికగా భారత్‌,ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి వన్డే పోరు ప్రారంభం కానుంది.గత ఏడాది మార్చిలో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ ఐదు వన్డే మ్యాచ్ల సిరీస్ ను 3-2 తో గెలిచి సొంతగడ్డపై భారత్ కు షాక్ ఇచ్చింది.నూతన సంవత్సరంలో వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియాపై గెలిచి గత పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటామని విరాట్ కోహ్లీ చెబుతున్నాడు.ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 57 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు జరగగా వాటిలో 14 భారత్‌,26 ఆస్ట్రేలియా గెలుపొందాయి.

వన్డే మ్యాచ్ల రికార్డులను పరిశీలిస్తే....ఇప్పటి వరకూ 137 వన్డే మ్యాచ్‌ల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడగా టీమిండియా 50 మ్యాచ్‌ల్లో, కంగారూలు 77 మ్యాచ్‌ల్లో గెలవగా మిగిలిన పది మ్యాచులు ఫలితం తేలలేదు.

వాంఖడేలో ఆసీస్ దే పై చేయి :

ఈ మైదానంలో ఆస్ట్రేలియా, భారత్ జట్లు మూడుసార్లు తలపడగా రెండు మ్యాచ్ లలో ఆసీస్ ను విజయం వరించగా చివరిసారి 2007లో ఇరు జట్లు తల పడినప్పుడు భారత్ గెలిచింది. వాంఖడే స్టేడియంలో భారత్ ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడి 10 మ్యాచ్లలో విజయం సాధించింది.చివరగా ఆడిన నాలుగు మ్యాచ్ లలో రెండిటిలోనే మాత్రమే విజయం సాధించింది.ఈ వేదికపై చివరిసారిగా 2017 అక్టోబర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp