ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం
By Krishna Babu

Follow us:
Follow @iDreamPost
ఎమ్మెల్యేల కోటాలో ఏపి శాసనమండలి స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోతుల సునీత నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తో పోతుల సునీత భేటీ అయిన సంధర్భంలో ఆమెకు సీఎం జగన్ బీఫామ్ అందజేశారు. దీంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా పోతుల సునీత బరిలో దిగారు. అయితే ఈ స్థానానికి ఒక్క నామినేషన్ మాత్రమే రావడంతో సునీత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించి 21న అధికారిక ప్రకటన వెలువడనుంది.


Click Here and join us to get our latest updates through WhatsApp