అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ వైఖరిని తప్పుబట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

By Kotireddy Palukuri Jan. 22, 2020, 11:41 am IST
అసెంబ్లీలో సీఎం వైఎస్‌ జగన్‌ వైఖరిని తప్పుబట్టిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అవలంభించిన వైఖరిని అధికార పార్టీ ఎమ్మెల్యే తప్పుబట్టారు. ఈ రోజు సభలో టీడీపీ సభ్యులు వెల్‌లోకి, స్పీకర్‌ చైర్‌ వద్దకు దూసుకెళ్లారు. సభ ప్రారంభంలోనే గందరగోళం ఏర్పడింది. ఈ అంశంపై చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి శాసనసభ్యుడు బియ్యం మధుసూదన్‌ రెడ్డి మాట్లాడారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీడీపీ సభ్యులు అలా ప్రవరిస్తుస్నున్నారని విమర్శించారు. ఎవరు ఎంత రచ్చ చేస్తున్నారో సాయంత్రానికి చంద్రబాబు ఆఫీసులో మార్కులు వేస్తున్నారని చురక అంటించారు.

చంద్రబాబు వైఖరి తెలిసి కూడా తమ నాయకుడు, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు మళ్లీ మళ్లీ చాన్స్‌ ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మొదటి రోజు సభలో చంద్రబాబుకు ఒకటికి మూడు సార్లు అవకాశం ఇచ్చారని, అయినా రాత్రి 9:30 గంటల వరకు ఆ పార్టీ సభ్యులు రచ్చ చేశారని గుర్తు చేశారు. టీడీపీ సభ్యుల దూషణలకు ప్రతిగా తాము దూషిస్తుంటే... ఇలా చేయొద్దని సీఎం జగన్‌ తమకు చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రజల నుంచి గెలవకుండా.. పార్టీ లాక్కున్న వారే కాబట్టి చంద్రబాబు ఇలానే వ్యవహరిస్తున్నారని బియ్యం మధుసూదన్‌ రెడ్డి విమర్శించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp