కేరాఫ్ అడ్రస్... వైఎస్సార్..!

By Kalyan.S Jul. 08, 2020, 06:50 pm IST
కేరాఫ్ అడ్రస్... వైఎస్సార్..!

విజయవాడలోని కంట్రోల్ రూం సమీపంలోని... వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద రైట్ టర్న్ తీసుకోండి..
ఆర్కే బీచ్ రోడ్డు లోని వైఎస్సార్ విగ్రహం వద్ద ఉండండి.. వస్తున్నా..
పంజాగుట్ట సర్కిల్ లోని రాజశేఖర్ రెడ్డి విగ్రహం ముందు లెఫ్ట్ తీసుకోండి..
మీటింగ్ ఎక్కడా..? కూకట్ పల్లి మెట్రో పక్కన ఉన్న వైఎస్ఆర్ గార్డెన్స్ లో...

ఇలా ఎక్కడ చూసినా... తెలుగు రాష్ట్రాల్లో ఏ ప్రాంతంలో చూసినా... వైఎస్సార్ నిలువెత్తు విగ్రహాలు కేరాఫ్ అడ్రస్ గా మారాయి. ప్రజల గుండెల్లోనే కాదు... ప్రతీ ప్రాంతంలోనూ మహా నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి కొలువై ఉన్నారనడానికి ఆవి నిదర్శనంగా మారాయి. ఆ నేత చిరునవ్వు... నేటికీ చాలా కుటుంబాల్లో వెలుగు నింపుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలకు చేసిన మేలు.. చాలా మందిలో మెదులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య శ్రీ, ఫీ రీయింబర్స్ మెంట్ లక్షలాది కుటుంబాలను ఆదు కున్నాయి. ఎందరో పేద విద్యార్థులను ఇంజనీరుగా తీర్చిదిద్దాయి. ఆ రెండు పథకాలు కాలం ఉన్నంత వరకూ చిరస్థాయిగా నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు. అందుకేనేమో.... ఆయన మృతితో 300 కు పైగా గుండెలు పగిలి పోయాయి. కోట్లాది కుటుంబాలు తల్లడిల్లి పోయాయి. ఆయన మరణానంతరం ఊరి, ఊరిలో.. వాడ, వాడలా వేల సంఖ్యలో వైఎస్సాఆర్ విగ్రహాలను అభిమానులు ఏర్పాటు చేశారు. ఆయన బతుకున్నపుడే కాదు.. చని పోయినా ఎందరికో దారి చూపుతున్నారు. వైఎస్సార్ విగ్రహం ఉన్న ప్రాంతాలు చాలా మందికి చిరునామాగా మారాయి.

మనిషి మనిషిని కలిపిన ఓ ఋషిగా..
వ్యవసాయాన్ని పండగ చేసిన మహర్షిగా..
పేదల చదువులకు బాసటగా నిలిచిన నాయకుడిగా..
ఆరోగ్య శ్రీ తో పేదల ప్రాణాలు నిలిపిన వైద్యుడిగా..

తెలుగు జాతి ఉన్నత కాలం ... అందరి గుండెల్లో మీ స్థానం పదిలం రాజన్న... అంటూ ఆయా ప్రాంతాల్లోని వైఎస్సార్ విగ్రహాల వద్ద నేడు ఆయన జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఇప్పటికీ, ఎప్పటికీ మా గుండెల్లోనే ఉన్నావని, ఉంటావని చాటి చెప్పారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp