వైఎస్సార్ పించన్ కానుకకు అర్హులు వీరే

By Kotireddy Palukuri Dec. 13, 2019, 11:53 am IST
వైఎస్సార్ పించన్ కానుకకు అర్హులు వీరే

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ పాలన సాగుతోంది. విద్య, వైద్య రంగాలలో ఇప్పటికే సమూల మార్పులకు నాంది పలికిన సీఎం జగన్ తాజాగా మరో కొత్త నిర్ణయానికి ఆమోద ముద్ర వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేస్తూ వృద్దులు, వితంతువులకు భరోసా కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. మరింత మందికి వైఎస్సార్ పింఛన్ కానుక పధకం వర్తించేలా నూతన మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో లక్షలాది మంది వృద్దులకు మేలు కలగనుంది.

పింఛన్ అర్హతలు ఇవి...

- గ్రామాల్లో నెల ఆదాయం 10 వేలు లోపు ఉండాలి. (గతంలో ఈ పరిమితి నెలకు 6 వేల రూపాయలు)
- పట్టనాలలో నెల ఆదాయ పరిమితి 12 వేల రూపాయలు
- 3 ఎకరాల లోపు మాగాణి, లేదా 10 ఎకరాల లోపు మెట్ట భూమి లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉండాలి. (గతంలో ఇది 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి.)
- కారు ఉన్న వారు అనర్హులు. టాక్టర్లు, ఆటోలు, టాక్సీ లు ఉన్నవారు అర్హులు.
- పట్టణాలలో 750 చదరపు అడుగుల లోపు సొంత ఇల్లు ఉన్న వారు అర్హులు.
- వయస్సు 60 ఏళ్ళు. (గతంలో వయస్సు 65 ఏళ్ళు)

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp