యూనివర్సీటీ ఉంటే ఎన్నో ఫలితాలు – ఇవిగో ఉదహారణలు

By Prasad Sep. 22, 2021, 01:30 pm IST
యూనివర్సీటీ ఉంటే ఎన్నో ఫలితాలు – ఇవిగో ఉదహారణలు

ఎంబీబీఎస్‌ చేసిన డాక్టరు కంటే అనుభవశాలైన కాంపౌండర్‌ మేలు అన్నట్టు విషయం పరిజ్ఞానం ఎంత ఉన్నా అనుభవం అనేది ఏ రంగంలోకి వారికైనా తోడ్పాటునిస్తుంది. వ్యవసాయ రంగానికి వస్తే వ్యవసాయోత్పత్తుల పరిశోధన ఫలాలు చాలా మట్టుకు అన్నదాతకు చేరడం లేదు. కాని ఏళ్ల శతాబ్ధాల తరబడి అన్నదాత తన అనుభవంతోనే భూసారం మొదలకుని వాతావరణ పరిశోధనలు అంచనాలు వేసుకుటూ ఏ కాలంలో.. ఏ పంట.. ఎన్నిరోజుల్లో దిగుబడి సాధింవచ్చు అనేదానిపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాడు.

కాని గుణాత్మకంగా జనాభా పెరుగుదల, సాగు భూమి తరగుదల కారణంగా కొంత సాంకేతికత వ్యవసాయానికి అవసరమవుతోంది. ఈ నేపథ్యంలోనే శాస్త్రవేత్తల ప్రాముఖ్యం అన్నదాతకు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెరుగుతున్న జనాభకు అనుగుణంగా అహార ఉత్పత్తులు సమకూర్చాల్సి బాధ్యత అన్నదాతపై అనివార్యంగా పడిరది. దీని వల్ల సాగులో నూతన మెళకవులు, నూతన పద్ధతులు అవలంభించాల్సిన అవసరం అన్నదాతకు ఏర్పడింది. సాంప్రదాయ వ్యవసయం ఎంత అవసరమో.. దానికి ఆధునీకత జోడిరచడం అంతే అవసరం.

ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు వాతావరణ, భౌగోళిక పరిస్థితులు అంచనా వేస్తూ కాలానుగుణంగా సాగు చేయాల్సిన ఉత్పత్తులను ప్రోత్సహిస్తూ అన్నదాతలకు అవగాహన కల్పిస్తూ నూతన వంగడాలపై పరిశోధనలు చేసి వాటి ఫలితాను క్షేత్రస్థాయికి చేరవేయ సంకల్పించాయి. ఇంత బాధ్యతను తలకెత్తుకున్న శాస్త్రవేత్తలు వారి పరిశోధన ఫలితాలను అన్నదాతకు అందించడంలో ఎక్కడో వైఫల్యం చెందుతున్నారు.

Also Read : 'తూర్పు'లో అవకాశాల కోసం వారసుల ఎదురుచూపులు

‘రైతును మించిన శాస్త్రవేత్త లేడు.’ ఇది అందరూ చెప్పే విషయమే. కాని ఇప్పటి వరకు ప్రోత్సహించేవారు మాత్రం లేదు. వ్యవసాయం.. ఉద్యాన పంటల్లో కొత్త వంగడాల ఉత్పత్తి,.. తక్కువ వ్యయంతో ఆధునిక యంత్రాల తయారీ.. పంటలకు మేలు చేసే బదనికల (మిత్రపురుగులు) ఉత్పత్తి వంటి విషయాల్లో రైతులు శాస్త్రవేత్తలనే అబ్బురపరస్తున్నారు. ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో రైతులు చేస్తున్న ఆవిష్కరణలు.. వారు అవలంబిస్తున్న మార్కెటింగ్‌ విధానాలు ప్రభుత్వ ఆలోచనా విధానంలో కూడా మార్పును తీసుకువస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో మరిన్ని ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అనుభవజ్ఞులైన రైతులు, విశ్రాంత శాస్త్రవేత్తలు.. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు... రైతు ఉత్పత్తి సంఘాల ద్వారా అన్నదాతకు పరిశోధనల ఫలితాలను అందేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలో ఉన్న డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన యూనివర్శిటీ పరిశోధన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎన్‌జీఈవోలకు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలకు.. రైతులకు ఇచ్చేందుకు ముందుకు వస్తోంది.

డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి ఉద్యాన యూనివర్శిటీ పరిశోధన స్థానం పరిధిలో ఉద్యాన పంటల మీద విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొబ్బరిపై దేశంలో ఏ పరిశోధనా స్థానం చేయనన్ని పరిశోధనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకప్పుడు కొబ్బరి పరిశోధనా స్థానంగా పేరొందిన అంబాజీపేట పరిశోధనా కేంద్రాన్ని ఉద్యాన పరిశోధన స్థానంగా మార్పు చేసి వర్శిటీ పరిధిలోకి తీసుకుని వచ్చారు.

Also Read : అదానీ రావడం లేదని నాడు - వచ్చేస్తున్నాడని నేడు, ఆంధ్రజ్యోతి అక్కసు రాతలు

ఈ కేంద్రంలో ఉత్పిత్తి చేసిన గోదావరి గంగ కొబ్బరి రకానికి అంతర్జాతీయంగా అధిక దిగుబడినిచ్చే వంగడంగా గుర్తింపు వచ్చింది. అదే విధంగా కొబ్బరిని ఆశించిన నల్లి తెగులు, ఆకుతేలు, కొబ్బరి రైతులకు పెను ముప్పుగా మారిన రూగోస్‌ వైట్‌ ఫ్లై (తెల్లదోమ) నివారణకు ఉత్పత్తి చేస్తున్నసూడోమల్లాడ ఆస్టర్‌ (డ్రైకోక్రైసా) బదనికలకు మంచి డిమాండ్‌ ఏర్పడిరది. ప్రస్తుతానికి దేశంలో ఈ బదనికల ఉత్పత్తి చేస్తున్నది ఈ పరిశోధనా కేంద్రం ఈ ఒక్కటే కావడం గమనార్హం. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల రైతులు తమ అవసరాలకు ఇక్కడ నుంచే బదనికలు తీసుకుని వెళుతున్నారు.

అయితే ఇక్కడ డిమాండ్‌ మేరకు ఉత్పత్తి జరగడం లేదు. ఏటా 45 లక్షల బదనికలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. దీనితో తెల్లదోమ అనుకున్న స్థాయిలో అదుపులోకి రావడం లేదు. దీనితో దృష్టిలో పెట్టుకుని బదనికల ఉత్పత్తి చేసే ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్నదాతలకే బదిలీ చేయాలని యూనివర్శిటీ నిర్ణయించింది. ఇందుకోసం మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో రైతు సంఘాలు, రైతులు, ఎన్జీవోలతో ఎంవోయులు చేసుకుంటున్నారు.

తెల్లదోమను నివారించే డ్రైకోక్రైసా బదనికల సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిచేందుకు 6 సంస్థలతో వర్శిటీ ఒప్పందం చేసుకుంది. దీనిలో రెండు ప్రైవేట్‌ సంస్థలు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా నిమ్మ రకాల ఉత్పత్తి పెంచేందుకు తమిళనాడుకు చెందిన బాలాజీ నిమ్మ ఆర్గనైనేజషన్‌తో ఒప్పందం చేసుకుంది. త్వరలో కొబ్బరిలో పేరొందిన గోదావరి గంగతోపాటు మరిన్ని వంగడాలను రైతులకు అందించేందుకు వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకునేందుకు యూనివర్శిటీ సిద్ధంగా ఉంది.

Also Read : మూడుసార్లు ముఖ్యమంత్రి.. పదవిలో ఉన్నది పట్టుమని పది నెలలే!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp