సీఎం జగన్‌ ఓ సంఘసంస్కర్త..! ఎలాగంటే..?

By Kotireddy Palukuri Aug. 03, 2020, 12:45 pm IST
సీఎం జగన్‌ ఓ సంఘసంస్కర్త..! ఎలాగంటే..?

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మూడేళ్లకు 1950 జనవరి 26వ తేదీన మనకు మనం రాసుకుని, మనకు మనమే సమర్పించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత దేశ రాజ్యాంగం పేరుగాంచింది. బ్రిటీషు వారి ఆర్థిక వనరుల దోపిడిలో సర్వం కోల్పోయి, కడుపేదరికంలో ఉన్న ప్రజలకు కనీసం అవసరాలు తీర్చి వారి సమాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి బంగారు బాటలు వేసేలా ఎన్నో చర్చలు, సవరణలు తర్వాత భారత రాజ్యాంగానికి తుదిరూపు ఇచ్చారు.

ప్రజల స్వేచ్ఛాయుత జీవితానికి రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్‌ 12 నుంచి 35 వరకూ ఉన్న అధికరణలు ఎంతో ముఖ్యమైనవి. అదే విధంగా ప్రజల సామాజిక, ఆర్థిక, ఆరోగ్య పరిరక్షణకు ఆదేశిక సూత్రాల పేరిటి 36 నుంచి 51 వరకూ పొందుపరిచిన ఆర్టికల్స్‌ ప్రభుత్వ విధులను, బాధ్యతలను స్పష్టం చేస్తున్నాయి. ప్రాథమిక హక్కులను చట్టపరంగా, న్యాయపరంగా సాధించుకోవచ్చు. వాటికి చట్ట, న్యాయ రక్షణ ఉంది. కానీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి నిర్వహించాల్సిన ఆదేశిక సూత్రాలకు మాత్రం చట్ట, న్యాయ రక్షణ లేదు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన, ప్రజా సంక్షేమం, ఆరోగ్యం పట్ల పాలకులకు ఉండే చిత్తశుద్ధిపై ఆదేశిక సూత్రాల అమలు ఆధారపడి ఉన్నాయి.

రాజ్యాంగం అమలులోకి వచ్చి ఏడు దశాబ్ధాలు పూర్తయింది. ఇన్నేళ్లులో కేంద్రంలో, రాష్ట్రాలలో ఎన్నో పార్టీలు ప్రజల మద్ధతుతో ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి. ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు మారారు. కానీ ఎవరూ కూడా ఆదేశిక సూత్రాలను పూర్తి స్థాయిలో అమలు చేసిన దాఖలాలు లేవంటే అతిశయోక్తి కాదు. స్వాతంత్య్రం వచ్చి 73 వసంతాలు పూర్తయ్యాయి. మూడు తరాలు ముగిశాయి. కానీ ఇప్పటికీ దేశంలోని ప్రజలందరికీ మూడు పూటలా తినేందుకు కూడా లేని వైనం, కనీస అవసరాలైన విద్య, వైద్యం అందని ద్రాక్షలాగే మిగిలిపోవడం, వ్యవసాయం కుంటుపడడం, సామాజిక, ఆర్థిక అసమానతలకు ప్రధాన కారణం ఆదేశిక సూత్రాలను పాలకులు అమలు చేయకపోవడమే.

మార్పు ఎక్కడో ఒక చోట మొదలవుతుంది. అది ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ఆదేశిక సూత్రాలను అమలు చేస్తూ టార్స్‌ బ్యారెర్‌గా ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నిలుస్తున్నారు. ఏడాది క్రితం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపట్టిన సీఎం జగన్‌.. తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు, సంక్షేమ పథకాలను పరిశీలిస్తే... ఆదేశిక సూత్రాలను మొత్తం అమలు చేసిన ఏకైక నాయకుడిగా నిలుస్తున్నారు. ఏడు దశాబ్ధాలలో ఏ నాయకుడుకు సాధ్యం కానిది సీఎం జగన్‌కు ఆచరణలో పెట్టారు.

ఆదేశిక సూత్రాలలో 38, 46, 47, 48 అధికరణలు(ఆర్టికల్స్‌) ప్రజల సాంఘిక, ఆర్థిక అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. ఆయా ఆర్టికల్స్‌ ఏమి చెబుతున్నాయి.. జగన్‌ ఏమి చేశారు..? అనేది ఒకసారి పరికించి చూస్తే ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక, ఆర్థిక అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం ఏమి చేసిందో తెలుస్తుంది.

ఆర్టికల్‌ 38: ప్రభుత్వాలు ప్రజలకు సాంఘిక, ఆర్థిక న్యాయము అందిస్తూ ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని ఈ ఆర్టికల్‌ చెబుతోంది. సీఎం జగన్‌ వివిధ పథకాల ద్వారా నేరుగా ప్రజలకే నగదును అందిస్తూ వారి సంక్షేమానికి, ఆర్థిక అభివృద్ధికి పాటుపడుతున్నారు. రాజకీయంగానూ రిజర్వేషన్లు కల్పించి సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సాంఘిక అభివృద్ధికి కృషి చేశారు.

ఆర్టికల్‌ 46: ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్య, ఆర్థిక అభివృద్ధి పట్ట తగిన శ్రద్ధ చూపాలని ఈ అధికరణ తెలుపుతోంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలను నాడు నేడు పథకం ద్వారా అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అన్ని వర్గాలలోని పేద, మధ్య తరగతి కుటంబాలలోని పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ప్రభుత్వ ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలలోనూ 50 శాతం రిజర్వేషన్లు అమలు చేశారు.

ఆర్టికల్‌ 47: ప్రజా ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మత్తు, మత్తుపానియాలను ప్రభుత్వాలు నిషేధించాలి. మూడు దశల్లో మద్యపానం నిషేధం చేస్తామని చెప్పిన సీఎం జగన్‌ ఇప్పటికే మొదటి దశను అమలు చేశారు. ఉన్న దుకాణాల్లో 33 శాతం రద్దు చేశారు. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తోంది.

ఆర్టికల్‌ 48: వ్యవసాయం, పశుపోషణను అభివృద్ధి పరచాలని చెబుతోంది. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, రుణాలు, పంట బీమా, మద్ధతు ధర.. అన్నీ కూడా గ్రామాలలోనే లభించేలా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలను సీఎం జగన్‌ ఏర్పాటు చేశారు. వ్యవసాయ సహాయకుడు అనే ప్రభుత్వ ఉద్యోగిని గ్రామ సచివాలయంలో నియమించారు. పశు పోషణకు అవసరమైన గడ్డి, దాణా, వైద్యం అందించేందుకు పశు వైద్యుడును గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచారు. గతంలో ధనం వెచ్చించి పాందే ఈ సేవలను ఉచితంగా ప్రభుత్వం అందిస్తోంది. ఎరువులు, పురుగు మందులు గతంలో వ్యాపారుల వద్ద తెచ్చే ధరల కన్నా 30 శాతం తక్కువకు లభిస్తున్నాయి. పాడి సహకార సంఘాలను బలోపేతం చేస్తూ తద్వారా పాడి రైతులకు ఆర్థిక లబ్ధి చేకూర్చేలా లీటర్‌ పాలపై 4 రూపాయల ప్రోత్సాహకాన్ని సీఎం జగన్‌ ప్రకటించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp