యోగి ఆదిత్యానంద్ సాహసం చేస్తున్నారా?

By Mavuri S Sep. 17, 2020, 08:45 am IST
యోగి ఆదిత్యానంద్ సాహసం చేస్తున్నారా?

ప్రతి నిర్ణయాన్ని వేగంగా నిర్దిష్టంగా వివాదాస్పదంగా తీసుకుంటారని పేరున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరో తేనెతుట్టెను కదిలించారు. ఉత్తరప్రదేశ్‌లో స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ పేరుతో కొత్త చట్టం తీసుకు రావడానికి ఆయన ఇటీవలే శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ ఫోర్స్ కు ప్రభుత్వం కల్పించే ఇస్తున్న అధికారాలు అపరిమితంగా ఉండడమే ఇప్పుడు విపక్షాల ఆందోళనలకు కారణం అవుతోంది. ఇప్పటికే ఫోర్సు తయారీకి రూట్‌మ్యాప్ తయారు చేయాలని సీఎం ఆదిత్యనాథ్ చెప్పడంతోపాటు పనులు చకచకా జరిగిపోతున్నాయి మరోపక్క విపక్షాలు సైతం దీన్ని వ్యతిరేకించడం కోర్టుకు వెళ్తామని చెప్పడంతో పాటు.ఇది సరైన నిర్ణయం కాదని, నియంతృత్వ ధోరణికి నిదర్శనం అంటూ యోగి ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరడంతో.అసలు ఈ చట్టం ఏంటీ.?ఎం చెబుతుంది? అనే అంశం దేశవ్యాప్త చర్చను, ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఇది మౌలిక స్వరూపం
ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ 2020 ఇది కొత్త చట్టం పేరు..దీన్ని తొలిదశలో తొమ్మిది బెటాలియన్లు గా విభజిస్తారు ప్రతి బెటాలియన్‌కు వెయ్యి మంది వరకు సిబ్బంది ఉంటారు.. మొత్తంగా 9900 మంది సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. ఫోర్స్ మొత్తాన్ని అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులు పర్యవేక్షిస్తారు.. ఆయన కింద ఐజిలు, డీఐజీలు, కమాండెంట్ లు డిప్యూటీ కమాండెంట్ లు తరహా అధికారులు సేవలు అందిస్తారు.కొత్త ఫోర్సు ఎయిర్ పోర్టులు కోర్టులు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు పరిశ్రమలు ఇతర ప్రాంతాల్లో వారి సేవలను అందిస్తారు.. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల కోర్టలో సైతం గాను పలు నేరాలు చోటుచేసుకోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ కోర్సులకు రూపకల్పన చేసింది అని నిపుణులు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ ఫోర్సు సేవలను ప్రైవేట్ సంస్థలు సైతం ప్రభుత్వానికి తగిన మొత్తంలో డబ్బు చెల్లించి పొందవచ్చు.. ప్రైవేటు వ్యక్తులకు సేవలందిస్తున్న సమయంలోనూ ఈ ఫోర్స్‌కు ఉండే అధికారాల్లో ఎలాంటి కోత ఉండదు.

ఎం అధికారాలు అంటే...?
ప్రసాద్ సెక్యూరిటీ ఫోర్స్ కు యోగి ప్రభుత్వం అపరిమిత అధికారాలను కట్టబెట్టింది.. ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి లేదా ఒక సమూహం నుంచి ఏదైనా నేరం జరిగేందుకు(కాగ్నిజబుల్) ఆస్కారం ఉన్నట్లు చిన్న ఆధారం లేదా అనుమానం ఉన్నా సదరు వ్యక్తిని వీరు అరెస్టు చేయవచ్చు. ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు.. కోర్టు ఆదేశం లేకుండానే సదరు వ్యక్తుల్ని అదుపులోనికి తీసుకోవచ్చు. అలాగే అనుమానిత ప్రదేశాల్లో ఎలాంటి ఆదేశాలు, వారెంట్లు లేకుండానే సెర్చు చేయవచ్చు. అరెస్టులు సే ర్చలు పూర్తయిన తర్వాత తగిన ఆధారాలతో నేరాన్ని నమోదు చేసి కోర్టులకు పంపవచ్చు. ఈ ఫోర్స్ పై న్యాయస్థానాలకు ఎలాంటి పర్యవేక్షణ ఉండబోదని ప్రభుత్వం చెప్పినట్లు నడుచుకుంటానని కూడా యోగి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.అంతేకాకుండా ఈ ఫోర్స్ లో పనిచేసే అధికారులు సిబ్బందిపై ఇష్టానుసారం కోర్టు కేసులు, చర్యలు తీసుకోకుండా ఉండేలా చూడనుంది.

సిఐఎస్ఎఫ్ ఉందిగా ?
రాజ్యాంగ రూపకల్పన లో కొన్ని అధికారాలు కేంద్రానికి కొన్ని అధికారాలు రాష్ట్రానికి మరికొన్ని ఉమ్మడిగా ఉంటాయి.. శాంతి భద్రతల పర్యవేక్షణ అంత రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది..అయితే ప్రత్యేక పరిస్థితుల్లో దేశ భద్రతకు అంతరాయం కలిగించే విషయాలు ఉంటే కేంద్రం జోక్యం ఉంటుంది.ఇప్పుడు యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం సైతం శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం తీసుకువచ్చింది గానే చూపిస్తోంది.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.ఈ ఫోర్స్ కీలకమైన పరిశ్రమలు కేంద్రం చేతిలో ఉండే కొన్ని సంస్థలకు భద్రత కల్పిస్తోంది.సిఐఎస్ఎఫ్ ను కాదని మహారాష్ట్ర ప్రభుత్వం సైతం 2010 లో మహారాష్ట్ర స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్‌ను.2012లో ఒరిస్సా ప్రభుత్వం స్టేట్ సెక్యూరిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకున్నాయి. మహారాష్ట్ర ఒడిసా ప్రభుత్వాలు తమ శక్తికి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసుకున్నా వాటికి పరిమిత అధికారాన్ని కట్టబెట్టాయి.ఏదైనా నేరం జరిగినప్పుడు మాత్రమే వారు సిఐఎస్ఎఫ్ సహాయంతో నిందితులను అదుపులోకి తీసుకోవడం కేసులు నమోదు చేయడం చేస్తారు.

మహారాష్ట్ర ఒడిశా ప్రభుత్వం తీసుకొచ్చిన కార్పొరేషన్లకు ప్రస్తుతం యోగి ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి అక్కడక్కడ కొన్ని పోలికలున్నా యూపీ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు పరిశ్రమలకు రక్షణ కల్పించడం అదేసమయంలో అవే అధికారాలు ఈ చట్టానికి ఉండడం కాస్త ఇరుకున పెట్టె అంశం..

మహారాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీ కార్పొరేషన్ లోని సెక్షన్ 16 ప్రకారం ఏ వ్యక్తి అయినా అరెస్టు చేసేందుకు అధికారం ఉన్నా సదరు ప్రదేశం ఎక్కడ ఉందో ఆ యాప్ పోలీస్ స్టేషన్ అధికారికి సమాచారం ఇచ్చి మాత్రమే అరెస్టు చేయాల్సి ఉంటుంది.ఒడిస్సా కార్పోరేషన్ చట్టం సెక్షన్ 11 లో ఒక వ్యక్తి లేదా సమూహం ఏదైనా నేరం చేయడానికి వచ్చారు అని భావిస్తే వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు ఎందుకు మాత్రమే కార్పొరేషన్ సిబ్బంది కి అనుమతి ఉంటుంది..యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక చట్టం సబ్ సెక్షన్ వన్ సెక్షన్ 10 ప్రకారం ఏ వ్యక్తి అయినా నేరానికి పాల్పడే అవకాశం ఉందని భావించినా చిన్న ఆధారం దొరికినా అతన్ని వెంటనే అరెస్టు చేయవచ్చు.అలాగే ప్రైవేట్ ప్రదేశాలను ఇష్టానుసారం సెటిల్ చేసే అధికారం కూడా ఫోర్సుకు ఉంటుంది. 

హక్కుల కాలరాత కదా...???
రాజ్యాంగం పౌరులకు కొన్ని హక్కులు కల్పించింది.దీనిలో భద్రతా ముఖ్యమైంది.యోగి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ప్రకారం ఇష్టానుసారం అరెస్టులు చేయడం సేర్చలు చేయడం చేస్తే కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.కక్షపూరితంగా కొందరిని బంధించడం లేదా భయపెట్టే సంఘటనలు జరుగుతాయి.ప్రతి చిన్న విషయం వివాదాస్పదం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.. దీనిలో పనిచేసే సిబ్బంది అధికారులు సైతం తమ ఇష్టా రాజ్యంగా  బెదిరింపులను సాధారణ ప్రజల పై చూపిస్తారు అనడంలో విశేషం లేదు.. ఒక మనిషిని అరెస్టు చేసి 24 గంటలలోపు కోర్టు ముందు ప్రవేశపెట్టకుంటే హెబియస్ కార్పస్ పిటిషన్ వేసుకోవచ్చని న్యాయస్థానాలు చెబుతున్నాయి. ఈ ఫోర్స్ కు నిర్దేశిత సమయం లేకుండా అరెస్టులు చేసి ప్రజలు ఇబ్బందులు పడితే యోగి ప్రభుత్వానికి చిక్కులు తప్పవు...

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp