పనితీరుకు పట్టం.. జడ్పీ చైర్మన్ల ఎంపిక పూర్తి

By Karthik P Sep. 25, 2021, 01:15 pm IST
పనితీరుకు పట్టం.. జడ్పీ చైర్మన్ల ఎంపిక పూర్తి

రాజకీయంగా అన్ని వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తున్న వైసీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జిల్లా పరిషత్‌ చైర్మన్‌/చైర్‌పర్సన్ల పదవుల్లోనూ అదే తీరును కొనసాగించారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ / చైర్‌పర్సన్ల ఎంపిక జరగనుండగా.. ఆయా జిల్లా జడ్పీ పీఠాలను ఎవరికి కేటాయించాలనే అంశంపై వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. నేతల పనితీరును ప్రామాణికంగా తీసుకున్నారు. పార్టీలో ఆది నుంచి ఉన్న వారికి పెద్దపీట వేశారు.

13 జిల్లా పరిషత్‌ స్థానాలు గెలుచుకోవడం లాంఛనం కావడంతో.. చైర్మన్లు, చైర్‌పర్సన్ల జాబితాను వైసీపీ విడుదల చేసింది. చైర్మన్లతోపాటు ఇద్దరు వైఎస్‌ చైర్మన్లను ఈ సారి నియమించనున్నారు. వారిని కూడా వైసీపీ ఎంపిక చేసింది. వారందరికీ ఆయా జిల్లా మంత్రులు పార్టీ బి ఫాం ఇవ్వనున్నారు.

జిల్లాల వారీగా చైర్మన్‌/చైర్‌పర్సన్లు..

1. శ్రీకాకుళం – పిరియా విజయ (బీసీ–సూర్యబలిజ)

2. విజయనగరం – మజ్జి శ్రీనివాస్‌/చిన్ని శ్రీను (తూర్పు కాపు)

3. విశాఖపట్నం – అరిబీరు సుభద్ర (ఎస్టీ– గిరిజన పోర్జా)

4. తూర్పుగోదావరి – విప్పర్తి వేణుగోపాల్‌ (ఎస్సీ–మాల)

5. పశ్చిమ గోదావరి – కౌరు శ్రీనివాస్‌ (బీసీ–శెట్టిబలిజ)

6. కృష్ణా – ఉప్పాళ్ల హారిక (బీసీ–గౌడ)

7. గుంటూరు – హెనీ క్రిస్టినా (ఎస్సీ–మాదిగ)

8. ప్రకాశం – బూచేపల్లి వెంకాయమ్మ (ఓసీ–రెడ్డి)

9. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు – ఆనం అరుణమ్మ (ఓసీ–రెడ్డి)

10. కర్నూలు – వెంకట సుబ్బారెడ్డి

11. వైఎస్సార్‌ కడప – ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

12. చిత్తూరు – వి.శ్రీనివాసులు (బీసీ–గౌడ)

13. అనంతపురం – బోయ గిరిజమ్మ (బీసీ–బోయ)

Also Read : మాజీ ఎమ్మెల్యే రౌతుకు నామినేటెడ్‌ పదవి దక్కనిది ఇందుకేనా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp