"ఫ్రూటీ" కుమార్ శ్రీమతికి చైర్మన్ గిరీ !

By Voleti Divakar Jul. 21, 2021, 07:45 pm IST
"ఫ్రూటీ" కుమార్  శ్రీమతికి  చైర్మన్ గిరీ !

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే కాదు ...అలంటి వారి కుటుంబానికి కూడా అండగా ఉంటామని చాటిచెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ . తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లో రాగిరెడ్డి చంద్రకళా దీప్తికి కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని కట్టబెట్టడమే ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు .
చంద్రకళాదీప్తి ప్రస్తుతం కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 30 వ డివిజన్ నుంచి వైసిపి కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్నారు . ఈమె దివంగత వైసిపి కార్పొరేటర్ రాగిరెడ్డి వెంకట జయరామ్ కుమార్ ( ఫ్రూటీకుమార్ ) సతీమణి .

గత ఏడాది కరోనా కారణంగా ఫ్రూటీ కుమార్ మృతి చెందారు . ఆ సమయంలో ఫ్రూటీ కుమార్ సతీమణిని పరామర్శించిన జగన్ ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు . నామినేటెడ్ పదవుల కేటాయింపు సందర్భంగా చంద్రకళా దీప్తికి కూడా చైర్మన్ పదవి ని కేటాయించి , ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు .

Also Read : ఆర్టీసీ చైర్మన్‌ దుగ్గాయపల్లి మల్లికార్జున రెడ్డి , వైఎస్సార్ బంధుత్వం తెలుసా?

ఫ్రూటీ డీలర్ నుంచి కార్పొరేటర్ గా ...

ఫ్రూటీ కుమార్ కాకినాడ నగరంలో పూటీ కూల్ డ్రింకుల డీలర్ షిగా ప్రస్థానం ప్రారంభించి ,తొలుత కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అనుచరుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు . అనంతరం కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ముఖ్య అనుచరుడిగా రాజకీయాల్లో చురుకై నా పాత్రను పోషించారు . 2005 లో కార్పొరేటర్‌గా గెలిచిన ఫ్రూటీ కుమార్ స్థాయీ సంఘం సభ్యుడిగా పనిచేశారు . అలాగే జిల్లా ప్రణాళిక మండలి సభ్యుడిగా పనిచేశారు . స్థానికంగా మంచి పట్టు ఉంది . అందుకే 2017 లో రిజర్వేషన్ కలిసి రాకపోయినా తన సతీమణి చంద్రకళా దీప్తిని కార్పొరేటర్ గా నిలబెట్టి గెలిపించుకున్నారు . ఆ తరువాత ఆమె వైసిపి ఫ్లోర్‌ లీడర్‌గా ఎంపికయ్యారు .

పార్టీ నాయకత్వం ఫ్రూటీ కుమార్ సమర్థతను గుర్తించి , కాకినాడ వైసిపి అధ్యక్షుడిగా నియమించింది . అయితే గత ఏడాది ఆయనకు కరోనా సోకి పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు . ఆవిర్భావం ఫ్రూటీ కుమార్ సేవలను గుర్తించిన ముఖ్యమంత్ర జగన్ ఆయన సతీమణి చంద్రకళాదీప్తికి కుడా చైర్మన్ పదవిని ఇచ్చి గౌరవించారు .  

Also Read : మొదట తండ్రిని తరువాత కూతురిని వరించిన ఆ పదవి .

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp