రఘురామకృష్ణం రాజుపై స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు

By Kotireddy Palukuri Jul. 03, 2020, 04:06 pm IST
రఘురామకృష్ణం రాజుపై స్పీకర్‌కు వైసీపీ ఫిర్యాదు

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అభియోగంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేసింది. ఈ రోజు ఉదయం విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి తదితరులు కొద్దిసేపటి క్రితం స్పీకర్‌ ఓం బిర్లాను కలిశారు. రఘురామకృష్ణం రాజుపై తమ ఫిర్యాదును రాతపూర్వకంగా అందించారు. కొద్ది రోజులుగా రఘురామకృష్ణం రాజు పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న నేపథ్యంలో ఇటీవల షోకాజ్‌ నోటీసు కూడా జారీ చేశారు. అయితే దానిపై సరైన సమాధానం చెప్పకుండా పార్టీ పేరు, రిజిస్ట్రేషన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో తాజాగా వైసీపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, రఘురామకృష్ణం రాజు వైసీపీ ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని అనర్హత, సస్పెన్షన్‌ వేటు పడకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యలకలాపాలకు పాలప్పడలేదని, తనకు యువజన రైతు శ్రామిక పార్టీ తరఫున షోకాజ్‌ నోటీసు ఇవ్వలేదంటూ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు సోమవారం విచారించే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp