కాపు ఉద్యమం కేసులు ఎత్తేసిన జగన్ సర్కార్

By Surya.K.R Dec. 12, 2019, 12:21 pm IST
కాపు ఉద్యమం  కేసులు ఎత్తేసిన జగన్ సర్కార్

కాపుల రిజర్వేషన్ల ఉద్యమం సమయంలో నమోదైన కేసులను కొట్టివేస్తు జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. తుని ఘటన సహా ఉద్యమం సందర్భంగా వివిధ ప్రాంతాలలో నమోదైన కేసుల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ల కోసం గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఉద్యమాన్నిఅణచివేయడానికి అనేక మందిపై కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తుందని ఆనాడు ముద్రగడ పద్మనాభం పలుమార్లు మీడియా ముందు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1994 నుండి ఉద్యమం నడిపానని ఆనాడూ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఉద్యమానికి మద్దతు ఇచ్చి ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో రిజర్వేషన్లపై హామీ ఇచ్చి తీరా గెలిచాక వాటి గురించి మాట్లాడితే కేసులు పెట్టి వేధింపులకి గురి చేస్తున్నారని, తక్షణం కేసులు ఉపసంహరించుకోవాలని పలుమార్లు కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు.

అయితే ఎన్నికల తరువాత కొత్తగా ఏర్పడిన జగన్ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం అభిష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకుని ఉద్యమం సమయంలో పెట్టిన ప్రతి కేసు ఉపసంహరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. అయితే రైలు దహనం కేసు విచారణ మాత్రం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేస్తు నిర్ణయం తీసుకున్నది. తమపై పెట్టిన కేసులకు జగన్ సర్కార్ మాఫీ చేయటంతో కాపు ఉద్యమ నేతలు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అలాగే భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp