ఎర్ర కొడవలి మెడలో... బాబు కష్టాల కడలిలో!

By Mavuri S Jan. 22, 2021, 09:00 pm IST
ఎర్ర కొడవలి మెడలో... బాబు కష్టాల కడలిలో!

ఈయన ఒంటరిగా పోటీ చేయలేరు పోటీ చేయగల సత్తా లేదు... ఆయన రాజకీయ చరిత్రలో ఒంటరిగా పోటీ చేసిన ఏ సారి గెలిచిన దాఖలాలూ కనిపించవు. పోనీ కలిసికట్టుగా వెళ్దామంటే ఖాళీగా ఉన్న వారు ఎవరూ లేరు.. ఆయనను నమ్మే పార్టీలు కరువయ్యాయి.. ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి టీడీపీ అధినేత చంద్రబాబుది.. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పొత్తులతో నే ఎన్నికలకు వెళ్లే చంద్రబాబు దూసుకొస్తున్న జమిలి ఎన్నికల్లో ఏ పార్టీతో జట్టు కట్టాలి ఎలా ముందుకు వెళ్లాలి..? తనకు కలిసి వచ్చేదెవరెవరు అనే విషయాల మీద మదన పడుతున్నారు. ఇప్పటికే ఆయన చేరదీసి ఆయనతో కలిసి కార్యకమాల్లో భాగం అయిన వామపక్షాలే చంద్రబాబుకు దిక్కయ్యే పరిస్థితి కనిపిస్తోంది. వామపక్షాలతో పొత్తు పెట్టుకునే కన్నా... ఒంటరిగా వెళ్ళడమే నయమని వారి వల్ల వచ్చే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ అని టిడిపి నేతలు చంద్రబాబును హెచ్చరిస్తున్నారు. అయితే ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలు ఎదుర్కోవడం, దానిలో నెగ్గడం చరిత్రలో లేని బాబు ఎన్నో కొన్ని సీట్లు ఓట్లు వామపక్షాల నుంచి పొందే అదే పుణ్యమా అంటూ ఇప్పుడు ఈ ఎన్నికల్లో వామపక్షాలతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చేది ఉండదు పోయేది తప్ప!!

వామపక్షాలకు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు బలమైన ఓటు బ్యాంకు ఉండేది. కార్మిక కర్షక లలో ఎక్కువ భాగం వామపక్ష భావజాలం ఇంటిదగ్గర ఉండేవారే కనిపించేవారు. అందులోనూ పోరాటాలు ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా ఉంటారని పేరున వామపక్ష నాయకులు వైపు పేద వారు సైతం చూసేవారు. 1990వ దశకాల్లో బలంగా 25 సీట్ల వరకూ సాధించిన వామపక్షాలు తర్వాత క్రమక్రమంగా బలహీనం అయ్యాయి. దానికి ఇరు వామపక్షాలు అయిన సిపిఐ సిపిఎం నాయకులు విధానాలు వారు తీసుకున్న నిర్ణయాలు ప్రజా పోరాటం సాగించిన పంథ నే అసలైన కారణం. కేవలం చందాలు దండుకొని తర్వాత పేదలను మోసం చేస్తాయి అని అపప్రద ను ఆంధ్రప్రదేశ్లో వామపక్షలు మూటగట్టుకున్నాయి. దీంతో వామపక్షాల బలం క్రమక్రమంగా బలహీనమైంది.

పవన్ కు నష్టమే ఎక్కువ!

2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో జనసేన వామపక్షాలు బీఎస్పీ మూడు కలిపి కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. బీఎస్పీ 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేస్తే సిపిఎం రెండు లోక్సభ స్థానాలు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. సిపిఐ సైతం రెండు లోక్సభ స్థానాలు, 7అసెంబ్లీ స్థానాలను తీసుకుంది. అయితే పోటీచేసిన చోట్ల వామపక్షాలకు వచ్చిన ఓటింగ్ చూస్తే అత్యంత దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి. అధికభాగం వామపక్షాలు అన్ని డిపాజిట్లు కోల్పోయినవే. దీనికి వారు రకరకాల కారణాలు చెబుతున్నారు సరే వామపక్షాల బలం అన్నది నానాటికి తగ్గిపోతోంది అన్నది వాస్తవం.
చంద్రబాబుతో కలిస్తే మరింత ప్రమాదం!

మునిగిపోయే నావ లో వామపక్షాలు కూర్చుంటే అవి కూడా ఆంధ్రప్రదేశ్ లో మునిగి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి నానాటికీ బలం తగ్గుతున్న సమయంలో వామపక్షాలు టిడిపితో జత కట్టడం వల్ల పెద్దగా సాధించేది ఏమీ ఉండదు. దీనివల్ల ఉన్న ఓట్లను సైతం వామపక్షాలు కోల్పోయే పరిస్థితి వస్తుంది. గతంలో మహాకూటమి అంటూ వామపక్షాల ను నిండా ముంచేసిన చంద్రబాబు తీరు మీద అప్పట్లోనే వామపక్ష నాయకులు అంతా దుయ్యబట్టారు. మరోసారి భవిష్యత్తులో చంద్రబాబును నమ్మవు అంటూ ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చెంత చేరితే వామపక్ష నాయకులు నుంచి సహాయ నిరాకరణ ఎదురయ్యే అవకాశం ఉంది. పోనీ చంద్రబాబు తో పొత్తు వల్ల పెద్దగా సాధించేది ఏమైనా ఉంటుందా అంటే అదీ లేదు. కేవలం సామాజికవర్గ పరంగా చంద్రబాబుకు దగ్గరైన వామపక్ష రాష్ట్ర నాయకులు ఆయనతో పొత్తు పెట్టుకునేందుకు మాత్రం ఉవ్విళ్ళురూతున్నారు.. దీంతో వామపక్షాలు టిడిపి పొత్తు అసలు ఏం జరుగుతుంది ముంచుకొస్తున్న జమిలి ఎన్నికలు ఎలా ముందుకు వెళ్తారు అనేది ఈ రెండు పార్టీల కార్యకర్తలను అర్థం కాని ప్రశ్నగా మారింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp