బొగ్గు కొరతపై జగన్ సూచనలను కేంద్రం పట్టించుకుందా?

By Raju VS Oct. 12, 2021, 12:00 pm IST
బొగ్గు కొరతపై జగన్ సూచనలను కేంద్రం పట్టించుకుందా?

ప్రపంచవ్యాప్తంగా బొగ్గు సంక్షేభం ఏర్పడింది. చైనా లాంటి దేశాలు విలవిల్లాడుతున్నాయి. ఇండియాలోనూ ఈ బొగ్గు కొరత తీవ్రం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ వారం రోజుల క్రితం కేంద్రానికి లేఖ రాశారు. ప్రధానికి రాసిన లేఖలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. కేంద్రం తక్షణం స్పందించాలని కోరారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన ఇప్పటి వరకూ రాలేదు. అదే సమయంలో ఏపీలో కరెంటు ఉత్పత్తి సమస్యలు మొదలయ్యాయి. అధిక ధరకు కొనుగోలు చేసేందుకు కూడా యూనిట్ రూ. 25 చొప్పున చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ధరకు కొనుగోలు చేయాలంటే పంపిణీ సంస్థలు ఇప్పటికే పీకల్లోతు నస్టాల్లో ఉన్నాయి. చంద్రబాబు హయంలో పెరిగిన అప్పులు, నష్టాల మూలంగా ఇటీవల ట్రూ అప్ ఛార్జీల భారం కూడా జనంపై పడింది. ఇప్పుడు మళ్లీ అధిక ధరకు విద్యుత్ కొనుగోలు అంటే మళ్లీ ప్రజలకు పెద్ద సమస్య అవుతుంది.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రకటన వాస్తవ విరుద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశమంతా బొగ్గు నిల్వలు కేవలం రెండు, మూడు రోజులకు సరిపడా మాత్రమే ఉన్నాయి. దానిమూలంగా విద్యుత్ ఉత్పాదనకు ఆటంకం ఏర్పడుతోంది. అనేక ప్లాంట్లలో కొన్ని యూనిట్లలో ఉత్పత్తి నిలిపివేశారు. ఏపీలోని వీటీపీఎస్ లో 2, రాయలసీమ పవర్ ప్లాంటులో 3 యూనిట్లలో ప్రస్తుతం ఉత్పాదన ఆగింది. అదే సమయంలో వీటీపీఎస్ లో రెండు రోజులకు, రాయలసీమలో మూడు రోజులకు సరిపడా మాత్రమే బొగ్గు నిల్వలున్నాయి. వాస్తవానికి 11రోజులకు తగ్గకుండా సరిపడా బొగ్గు నిల్వలుండాలనే విద్యుత్ సంస్థలు భావిస్తాయి. ప్రస్తుతం దానికి భిన్నంగా పరిస్థితి కనిపిస్తోంది.

Also Read : గ్యాస్ @ 2657, లీటర్ పాలు @ 1195.. భయమేస్తోందా?

బొగ్గు నిల్వలున్న రాష్ట్రాలకు కొంత ఉపశమనం కనిపిస్తోంది. కానీ ఏపీలాంటి రాష్ట్రాలకు దూర ప్రాంతాల నుంచి బొగ్గు తరలించాల్సి ఉంటుంది. అందుకు కంపెనీలు సిద్ధం కావడం లేదు. రాకులు సిద్ధంగా లేకపోవడంతో రవాణా సమస్య వస్తోంది. ఏపీ ప్రభుత్వం చెబుతున్నట్టుగా ఆక్సిజన్ నిల్వలున్నప్పటికీ వాటిని రవాణా చేయలేకపోవడంతో వందల మంది కరోనా మూలంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి లాంటిదే ఇది. దానికి కేంద్రం చొరవ తీసుకుని ఏపీకి తక్షణమే 20 రాకుల బొగ్గు పంపించాలని సీఎం కోరారు. కానీ కేంద్రమంత్రి మాత్రం బొగ్గు కొరత లేదు, ఇండియాలో రాదు అన్నట్టుగా ప్రచారం చేశారు.

దేశవ్యాప్తంగా బొగ్గు కొరత అనేక రాష్ట్రాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అందులో ఏపీ ఒకటి. దానిని జాతీయ సమస్యగా కేంద్రం భావించాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగా అప్రమత్తం కావాలి. కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. కానీ సమస్య పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకున్నట్టు కనిపించడం లేదు. ఆ విషయంలో జాప్యం జరిగితే సమస్య తీవ్రమవుతుంది. శీతాకాలమే అయినప్పటికీ కరోనా తదనంతరం డిమాండ్ భారీగా పెరిగిన నేపథ్యంలో సమస్య మరింత ముదరకుండా కేంద్రం చొరవ చూపాల్సిన అవసరం ఉంది. సీఎం జగన్ సూచనకు అనుగుణంగా గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పాదనకు అవకాశం ఇవ్వడం వంటి చర్యలు తక్షణమే అవసరమని చెప్పవచ్చు. జగన్ బాటలో కేజ్రీవాల్ సహా అనేక మంది సీఎంలు కేంద్రానికి విజ్ఞాపనలు చేశారు. వాటికి అనుగుణంగా స్పందించడం అత్యవసరంగా కనిపిస్తోంది.

Also Read : జ‌గ‌న్.. ఒక్క పిలుపు చాలు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp