కలవని కలవపూడి!!

By Mavuri S Jan. 22, 2021, 06:57 pm IST
కలవని కలవపూడి!!

బురదగుంటలో దిగారు.. రోడ్లపై పడుకున్నారు... కళ్ళంలో పని చేశారు... తెలుగుదేశం పచ్చమీడియాకు కావలసినంత ప్రచారం ఇచ్చారు. పాపం చివరకు చంద్రబాబు మనసు మాత్రం గెలుచుకో లేకపోయారు. 2019 ఎన్నికల్లో.... ప్రజలకు దగ్గరగా ఉంటాడు ఎన్నో పనులు చేస్తాడు పోరాటాలలో కొత్త పంధా అంటూ పచ్చ పత్రికలు ఆకాశానికెత్తేసిన పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ శాసనసభ్యుడు కలవపూడి శివ ప్రస్తుతం కనిపించకుండా తిరుగుతున్నారు. 2019 ఎన్నికల్లో నియోజకవర్గం టీడీపీ టికేట్ ఆయన తమ్ముడు కు ఇవ్వడంతో శివ రాజకీయ భవిష్యత్తు మీద చీకట్లు అలముకున్నాయి. ఎం చేయాలో తెలియక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఆయన తటస్థ స్థితిలో ఉన్నారు. జిల్లా టిడిపి నాయకులతో ఆయన టచ్ లో లేరు. గతంలో ఎంతో అన్యోన్యంగా ఉండే నాయకులను కలవడానికి ఇష్ట పడటం లేదు. తాజాగా చంద్రబాబు పశ్చిమ గోదావరి జిల్లా డెల్టా ప్రాంతాల్లో నిర్వహించిన టూర్ లోను కలవపూడి శివ జాడ కనిపించలేదు.

కొట్టిన పిండి.. ఉండి

ఉండి నియోజకవర్గం లో ఉన్న 4 మండలాలు కలవ పూడి శివ కు కొట్టిన పిండి. ఉండి ఆకివీడు కాళ్ళ పాలకోడేరు మండలాల్లో కలవపూడి శివ కు బలమైన అనుచరగణం ఉంది. క్షత్రియ సామాజిక వర్గం ఎక్కువగా ఉండి ఉండి నియోజకవర్గం లో ఏ పార్టీ నుంచి అభ్యర్థి అయిన రాజులూ తరఫునే ఉంటారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందని వారిని ఇక్కడ అంతగా ఆదరించారు. యువ నాయకుడిగా వచ్చి... 2009, 2014 రెండు సార్లు ఉండి నుంచి గెలిచిన శివను... 2019 ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు టిడిపి టికెట్ మీద నర్సాపురం ఎంపీగా పోటీ చేయించారు. ఉండి నియోజకవర్గం టికెట్ ను కలవపూడి శివ తమ్ముడు అయిన కలవపూడి రాంబాబు కు ఇచ్చారు. దీనిపై అప్పట్లోనే శివ అభ్యంతరం తెలిపారు. నర్సాపురం లోక్సభ పరిధిలో తనకు అంతగా ఎవరు అనుచరులు, తెలిసిన నాయకులు లేరని తాను ఉండి నియోజకవర్గం నుంచే బరిలో ఉంటానని చంద్రబాబు అడిగారు. అయితే టీడీపీకి నర్సాపురం లోక్సభ నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా ఎవరు దొరక్కపోవడంతో పాటు అక్కడ క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎవరు పార్టీలో అందుబాటులో లేకపోవడంతో ఉండి నుంచి శివను నర్సాపురం పంపారు. దీనిపై మొదటినుంచి కినుక వహించి ప్రచారంలోనూ అంతగానే ముందుకు సాగిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఉండి నుంచి తమ్ముడు రాంబాబు గెలిచినప్పటికీ అతనికి రాజకీయాల్లో అంత అనుభవం లేకపోవడంతో అతడు సైలెంట్ గానే ఉండి పోయాడు. మరోపక్క రాజకీయంగా ఈసారి గెలిస్తే జిల్లాలో చక్రం చెప్పవచ్చని భావించిన కలవపూడి శివ ఆశలను చంద్రబాబుది చేయడంతో ఆయన ఇప్పుడు ఏం చేయాలో తెలియక మౌనం పాటిస్తున్నారు.

ఎవరిని కలవని స్థితి!

2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ వివిధ కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ దానిలో కలవపూడి శివ మాత్రం కలవడం లేదు. గతంలో శివ టిడిపికి చెందిన నాయకుడు చింతమనేని తో చాలా క్లోజ్ గా ఉండే వారు. ఇద్దరు తెలుగు యువత నుంచి రావడంతో పాటు పాత స్నేహం ఉండడంతో ఏ కార్యక్రమమైనా కలిసి చేసేవారు. అయితే 2019 ఎన్నికల తర్వాత చంద్రబాబు తనకు కావాలనే నర్సాపురం ఎంపీగా పోటీ చేయించాలని భావించిన శివ అది రాజకీయంగా తనకు కచ్చితంగా అడ్డు పడే విషయం గా భావించి ఎం నిర్ణయాలు తీసుకోలేక బయటకు రాలేక సతమతం అవుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp