పునాది రాళ్లను సమాధిరాళ్ళు చేసింది ఎవరు?మిగులు జలాలు దక్కకుండా ద్రోహం చేసింది ఎవరు?

By Siva Racharla Dec. 12, 2019, 06:27 pm IST
పునాది రాళ్లను సమాధిరాళ్ళు చేసింది ఎవరు?మిగులు జలాలు దక్కకుండా ద్రోహం చేసింది ఎవరు?

1988 నుంచి 2004 మధ్య నీటి ప్రాజెక్టులకు వేసిన పునాది రాళ్లన్ని సమాదిరాళ్లయ్యాయి. మొదటి సారి,రెండవసారి, మూడవసారి శంకుస్థాపనలుకు అయిన ఖర్చు మేర కూడా ప్రాజెక్టుల నిర్మాణానికి ఖర్చు పెట్టలేదు. హంగు ఆర్భాటం తప్ప పలుగు పడింది లేదు,మట్టి తట్ట నెత్తికెత్తింది లేదు.

చరిత్రే సాక్ష్యం... 1988 అక్టోబర్ ,నవంబర్ నెలలో శంకుస్థాన జరిగిన హంద్రీ-నీవా,గాలేరు-నగరి ప్రాజెక్టుల పూర్తిచెయ్యటానికి 1994-2019 మధ్య పద్నాలుగు సంవత్సరాలు అధికారములో ఉన్న చంద్రబాబుకు మనసు రాలేదా?లేక పద్నాలుగు సంవత్సరాల సమయం సరిపోలేదా?అవును శంకుస్థాపన చేసింది ఎన్టీఆర్ కానీ వైస్సార్ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పనులు జరిగింది శూన్యం.

1995-2019 మధ్య 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ నీటి ప్రాజెక్టులకు చేసిన అన్యాయానికి సమాధానం చెప్పకపోవచ్చు కానీ చరిత్ర మారదు. స్థానికులకు ఏ ప్రాజెక్ట్ ఎవరి హయాంలో నిర్మాణం జరిగిందో చంద్రబాబో లేక ఆంధ్రజ్యోతో చెప్పావలసిన పనిలేదు. మొన్న ఎన్నికల్లో నేను నీళ్లు ఇచ్చాను అని చంద్రబాబు ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోవటమే దీనికి పెద్ద ఉదాహరణ.

బ్రిజేష్ ట్రబ్యునల్ ఏర్పాటయింది 2004 లో.2004 మే నెలలో ముఖ్యమంత్రిగా వైస్సార్ ప్రమాణస్వీకారం చేసిన తరువాత మొదటి ప్రాధాన్యతలో నీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. వెలిగొండ,హంద్రీ-నీవా మరియు గాలేరు-నగరి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి టెండర్లు పిలిచాడు,నిధులు ఇచ్చాడు పనులు వేగంగా జరగాలి తన హాయాంలోనే వీటి నిర్మాణం పూర్తి కావాలన్న లక్ష్యంతో పనిచేశాడు.

దీనితో ఎగువ రాష్ట్రాలు ఆ ప్రాజెక్టులు అక్రమమైనవని,వాటి నిర్మాణానికి అనుమతులు లేవని బ్రిజేష్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేశాయి. బ్రిజేష్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది. ఈ మూడు ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి?బచావత్ అవార్డు(కృష్ణా జలాల పంఫిణీ మీద మొదటి ట్రిబ్యునల్) నీళ్ల కేటాయించిందా?అని ప్రశ్నించింది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేక వైస్సార్ ఏమి సమాధానం చెప్తారు?అయ్యా మా మాజీ ముఖ్యమంత్రులు శంకుస్థాపన చేసి ప్రచారం చేసుకోవటం మీద పెట్టిన శ్రద్ద ప్రాజెక్టు నిర్మాణం మీద కానీ,వాటికి నీటి కేటాయింపుల మీద కానీ పెట్టలేదు... తప్పయిపోయింది ,మీరు దయచేసి నీటిని కేటాయించండి అని చెప్పాలా?

అడగ్గానే ఇవ్వటానికి కృష్ణా నదిలో ఎన్ని టీఎంసీ ల నీళ్లు అదనంగా ఉన్నాయి?ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక మన విజ్ఞప్తిని ఒప్పుకుంటాయా?అసలు ఫిర్యాదు చేసిందనే వీళ్ళు కదా?మరి నీళ్లు లేకుండా ఎందుకు ప్రాజెక్టులు కడుతున్నారు?అని బిజేష్ మనల్ని ప్రశ్నించాడు.సరైన సమాధానం చెప్పకపోతే మొదటికే ఎసరు వస్తుంది... నిర్మాణ దశలో ఉన్న హంద్రీ-నీవా,గాలేరు-నగరి,వెలిగొండ ప్రాజెక్టు పనులు ఆపివెయ్యమని ఆదేశించే హక్కు బ్రిజేష్ ట్రిబునల్కు ఉంది.

ఈ ప్రమాదం నుంచి బయటపడటానికి నీళ్లు ఉన్నప్పుడు వాడుకుంటాం అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రిజేష్ కు చెప్పింది. అప్పటి లెక్కల ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మంచి వరద వస్తుంది.1997-2003 మధ్య తప్ప ప్రతి సంవత్సరం కనీసం 2000 టీఎంసీ నీరు సముద్రంలో కలుస్తుంది. కాబట్టి వరద నీటిని సరైన పద్దతిలో సరైన సమయంలో వాడుకోవటానికే ఈ మూడు ప్రాజెక్టులు కడుతున్నామని వైస్సార్ ప్రభుత్వం బ్రిజేష్ ట్రిబ్యునల్కు చెప్పింది.దానికి వారు కన్విన్సు అయ్యి ప్రాజెక్ట్ పనులు కొనసాగించటానికి అంగీకరించారు.

చంద్రబాబు తాను తప్ప మరెవరు ఏ పని చేయలేరు,చెయ్యలేదు అని చెప్పుకోవటంలో ఉన్న ఆత్రుత 1995-2019 మధ్య కాలం నిజంగానే ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఆయనకు పేరు వచ్చేది,బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏర్పాటు కాక ముందే ఆ ప్రాజెక్టులు పూర్తి అయ్యిఉంటే ,అయ్యా మా ప్రాజెక్టులకు నికర జలాలు కేటాయించండని అడిగే అవకాశం మనకు దక్కివుండేది.

బచావత్ ట్రిబ్యునల్ మిగులుజలాలను ఉపయోగించుకునే స్వేచ్ఛ దిగువున ఉన్న మనకు మాత్రమే ఇవ్వగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2016లో ఇచ్చిన తుది తీర్పులో మిగులు జలాలను అన్ని రాష్ట్రాలకు అంటే మహారాష్ట్ర, కర్ణాటక,తెలంగాణాకు మనతో పాటు పంచింది.అంటే ఎగువ రాష్టాలకు కూడా వరద నీటిలో హక్కులు సంక్రమిస్తాయి... ఇంక మన ప్రాజెక్టులకు నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయి?చంద్రబాబు ప్రభుత్వం అంత గొప్పగా బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు వాదనలు చేసింది. కేటాయింపుల మీద తెలంగాణా,ఆంద్ర సుప్రీం కోర్టుకు వెళ్లాయి.. కోర్టు తీర్పు మనకు అనుకోవాలంగా రావాలని కోరుకున్నా గత తీర్పులను పరిశీలిస్తే కష్టమే ...

వైస్సార్ నికరజలాలు వద్దని బీజేష్ ట్రిబ్యునల్ కు చెప్పాడని ఆరోపిస్తున్న చంద్రబాబు తన హయాంలో మనం మిగులు జలాల మీద కోల్పోయిన సహజ హక్కుల గురించి సమాధానం చెప్పాలి.

గతంలో కంటే ఇప్పుడు నీటి ప్రాజెక్టుల మీద ప్రజలలో అవగాహన ,ఆసక్తి పెరిగాయి.కల్లబొల్లి మాటలు అబద్దపు ప్రచారాలు పనిచేయవు. ప్రతిపక్ష స్థానంలో ఉండి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తిచెయ్యమని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తే టీడీపీకి మంచిది,రాష్ట్రానికి మంచిది. చరిత్ర చించితే చిరిగేది కాదు!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp