మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గుర్తున్నారా ?

By Voleti Divakar Sep. 24, 2021, 09:20 pm IST
మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ గుర్తున్నారా ?

ఇటీవల జరిగిన మహానేత వైఎస్సార్ 12వ వర్థంతి కార్యక్రమంలో ఆయన కనిపించలేదు.ఇంతకీ మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ ప్రస్తుతం ఎక్కడున్నారు .... ఏం చేస్తున్నారు..ఈ విషయమై ఉభయ గోదావరి జిల్లాలు సహా రాష్ట్రవ్యాప్తంగా నాటి రాజకీయ నాయకులు,ప్రజలు ఆసక్తి కనపరుస్తున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితులు,మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ సుమారు రెండు దశాబ్దాల పాటు పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు.స్వతహాగా ఉల్లాసంగా ... ఉత్సాహంగా ఉండే వట్టి వసంతకుమార్ భేషజాలకు దూరంగా ఉంటారు. అలాంటి నేత ప్రస్తుతం రాజకీయాల నుంచి కనుమరుగయ్యారు.ఐదేళ్ల క్రితం ఆయన సతీమణి ఉమాదేవి కన్నుమూయడంతో మానసికంగా ఒడిదుడులకు లోనయ్యారు.ఈ నేపథ్యంలో రాజకీయ సన్యాసం తీసుకుని ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలో సమయం దొరికినపుడు టెన్నిస్ ఆడుతూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.

Also Read : రాజకీయాలకు కేశినేని గుడ్ బై .. వారసురాలి రంగ ప్రవేశం?

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం పూళ్ల సమీపంలోని ఎంఎం పురం గ్రామానికి చెందిన వట్టి వసంతకుమార్ 1953 లో కాకినాడలో జన్మించారు . 2004,2009 లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్, కె రోశయ్య , కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు.

2010 లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో టూరిజం శాఖను నిర్వహించారు.మంత్రివర్గంలో ప్రాధాన్యత లేని శాఖను కేటాయించారని అలిగి రాజీనామా చేశారు . అధిష్టానం బుజ్జగించడంతో మంత్రివర్గంలో కొనసాగారు.మహానేత వైఎస్ హయాంలో,ఆ తరువాత కె రోశయ్య మంత్రివర్గంలో గ్రామీణాభివృద్ధిశాఖను నిర్వహించిన వట్టికి కిరణ్ కుమార్ రెడ్డి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని అప్పట్లో వార్తలు వచ్చాయి. రాష్ట్ర విభజన తరువాత వట్టి వసంతకుమార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఎన్ రఘువీరారెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వట్టి పిసిసి ఉపాధ్యక్షుడిగా చురుగ్గా ఉన్నారు .

Also Read : నాడు ఎమ్మెల్యే పదవి మిస్ ,నేడు జడ్పీ చైర్మన్

తండ్రికి తగ్గ తనయుడు..

వట్టి వసంత కుమార్ తండ్రి వెంకట రంగ పార్థసారథి ఎమ్మెల్సీగా..పశ్చిమగోదావరి జిల్లా డిసిసిబి చైర్మన్ గా పనిచేశారు.డీసీసీబీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఈనాడులో వచ్చిన ఒక తప్పుడు వార్తపై ఆయన తీవ్రంగా స్పందించారు.ఈకేసులో స్వయంగా ఈనాడు చైర్మన్ ను ఏలూరు కోర్టుకు రప్పించారు. పార్థసారథి 1972లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంగుటూరు నుంచి పోటీ చేసారు. ఒకసారి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు.ఏదైనా పట్టుదల విషయంలో వట్టి వసంత కుమార్ తండ్రికి తగ్గ తనయుడిగా చెప్పవచ్చు. ఇప్పటికి తన తండ్రిని చూసేందుకు వసంత కుమార్ తరుచు పూళ్ల వెళుతూ ఉంటారు.

కాంగ్రెస్ విధానంతో విభేధించి ...

గత సార్వత్రిక ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ విధానాలను తీవ్రంగా ఎండగట్టారు వట్టి వసంతకుమార్. ముఖ్యంగా గోదావరిపై పట్టిసీమ, చింతలపూడి వంటి ఎత్తిపోతల పధకాలను తీవ్రంగా వ్యతిరేకించి ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు.2018 లో తమ పార్టీకి బద్ద శత్రువు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని వట్టి వసంతకుమార్ జీర్ణించుకోలేకపోయారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.ఆ తరువాత రఘువీరారెడ్డితో పాటు , వట్టి వసంతకుమార్ కూడా రాజకీయాల నుంచి పూర్తిగా దూరం జరిగారు. అమధ్య విశాఖపట్నంలో ఒక భూ వివాదంలో ఆయన పేరు వినిపించింది. మళ్లీ ఆయన వార్తల్లో కనిపించలేదు .. వినిపించలేదు.

Also Read : మాజీ ఎమ్మెల్యే రౌతుకు నామినేటెడ్‌ పదవి దక్కనిది ఇందుకేనా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp