తెలంగాణకు మమత బెనర్జీ 2 కోట్ల వరద సాయం..

By Kiran.G Oct. 21, 2020, 06:52 am IST
తెలంగాణకు మమత బెనర్జీ 2 కోట్ల వరద సాయం..

భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహా నగరం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి సాయం అందించేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే తమిళనాడు,ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ తదితర రాష్ట్రాలు తెలంగాణకు వరద సాయాన్ని ప్రకటించాయి. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణకు రెండుకోట్ల విరాళంగా ముఖ్యమంత్రి సహాయనిధికి అందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్లను విరాళంగా పంపిన మమత బెనర్జీ ఓ లేఖను రాసారు.అందులో కొద్ది రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాల గురించి తెలిసి ఎంతో తాను ఎంతో బాధపడ్డానని,వరదలతో తెలంగాణకు తీవ్రంగా నష్టపోయిందని, భారీగా ప్రాణ నష్టం కూడా జరిగిందని, బాధితులందరికీ సానుభూతి తెలుపుతున్నామని లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.ఈ విపత్తు సమయంలో తెలంగాణకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని,కొన్ని నెలల క్రితం తమ రాష్ట్రం కూడా అంఫాన్ తుఫాన్ వల్ల తీవ్రంగా నష్టపోయి ఇలాంటి కష్టాన్నే ఎదుర్కొందని గుర్తు చేశారు.

కాగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళం పంపినందుకు సీఎం కేసీఆర్ మమతా బెనర్జీకి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్పారు. కుండపోత వర్షాలతో అతలాకుతలం అయిన భాగ్యనగరాన్ని ఆదుకోవడానికి తెలుగు సినీ ప్రముఖులు తమ వంతుగా విరాళం ప్రకటించిన సంగతి తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp