విశాఖ మెట్రోపై త్వరలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

By Suresh Dec. 10, 2019, 01:27 pm IST
విశాఖ మెట్రోపై త్వరలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు

విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్న మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో త్వరలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమైంది. గతంలో రూ.12,500 కోట్లుగా ఈ ప్రాజెక్టును సిద్దం చేశారు. అయితే డిపిఆర్ లో మార్పులు తీసుకువచ్చి మెట్రో రైల్ కాకుండా లైట్ మెట్రోగా ప్రాజెక్టుగా చేపట్టాలని నిర్ణయించడం కారణంగా అంచనా వ్యయం రూ.8,300 కోట్లకు తగ్గింది.

ఈ విధంగా మార్పులు తీసుకువచ్చిన ఈ ప్రాజెక్టుపై 5 సంస్థలు పీపీపీ పద్ధతిలో ఆసక్తి చూపించాయి. వచ్చిన 5 సంస్థలకు ప్రాజెక్టు చేపట్టేందుకు రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్స్‌ని 2018 మార్చిలో అన్ని సంస్థల నుంచి స్వీకరించిన ఏఎంఆర్‌సీ.. జనవరి 2019లో అగ్రిమెంట్‌కు వెళ్లాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి ప్రాజెక్టు పట్టాలెక్కించాల్సిన గత ప్రభుత్వం పలు కారణాల చేత ముందుకు సాగించలేకపోయింది. తాజాగా మెట్రో రైలు ప్రాజెక్టుల్లో వైసీపీ ప్రభుత్వం పలు మార్పులు చేయనుంది.

విశాఖ మెట్రో ప్రాజెక్టుని వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అమరావతి మెట్రోరైల్‌ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టు డిజైన్లలో మార్పులు చేయడంతో పాటు గతంలో ఉన్న డీపీఆర్‌ని కూడా మార్చనున్నారు. ఫస్ట్‌ ఫేజ్‌లో అదనంగా 4 కిలోమీటర్లు పెరగడంతో అంచనా వ్యయం కూడా పెరిగింది. దీనివల్ల పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తులు చేస్తున్నారు. త్వరలోనే దీనిపై అధికారులు స్పష్టమైన వివరాలు వెలువడించనున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp