రాజ్యసభ బిఎసి సభ్యునిగా విజయసాయి రెడ్డి

By Krishna Babu Aug. 04, 2020, 08:34 pm IST
రాజ్యసభ బిఎసి సభ్యునిగా విజయసాయి రెడ్డి

వై.యస్.ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ్యులు విజయసాయి రెడ్డి గారికి ఎగువ సభలో అరుదైన గౌరవం దక్కింది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాలుగు స్థానాలు గెలిచి మొత్తం ఆరు స్థానాలను రాజ్యసభలో కైవసం చేసుకోవడంతో బలమైన పార్టీగా ప్రాబల్యం పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా వారికి వివిధ కోణాల్లో తగినంత ప్రాధాన్యత ఇస్తునట్టు కనిపిస్తుంది. అయితే తాజాగా మనోజ్ కుమార్, మల్లిఖర్జున్ ఖార్గే, శివ ప్రతాప్ శుక్లాతో పాటు విజయసాయి రెడ్డిని కూడా రాజ్యసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బిఎసి) సభ్యునిగా నామినేట్ చేస్తు ఉపరాష్ట్ర పతి వెంకయ్యనాయడు ఉత్తర్వులు జారీ చేశారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జారీ చేసిన ఈ ఉత్తర్వులతో రాజ్యసభలో ఎజెండాను నిర్ణయించడంలో విజయసాయిరెడ్డి గారు కూడా కీలక పాత్ర పోషించబోతున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ముఖ్యమైన పార్టీగా అవతరించిందనే చెప్పాలి. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఉన్న 11 మంది రాజ్యసభ సభ్యుల్లో నలుగురు భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉండగా ఒకరు తెలుగుదేశం సభ్యులు ఉన్నారు, ఇక మిగిలిన ఆరు రాజ్యసభ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెస్ కి విజయసాయి రెడ్డితో పాటు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అల్లా అయోధ్య రామి రెడ్డి, పరిమల్ నత్వానీ వెమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp