వైశ్రాయ్ - స్పీకర్ పశ్చాత్తాపం

By iDream Nagaraju Dec. 10, 2019, 10:23 am IST
వైశ్రాయ్ - స్పీకర్ పశ్చాత్తాపం

వైశ్రాయ్ పాపం చేసిందుకే భాగం అయినందుకే 15 ఏళ్లు అధికారానికి దూరమయ్యానని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.1995 లో ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన తరువాత ఆయన అసెంబ్లీ కి వస్తే ఆయనకు మైకు కూడా ఇవ్వకుండా అవమాన పరిచారని, ఆ పాపం లో తాను భాగస్వామిని అయినందుకు ఇప్పుడు భాద పడుతున్నాను అని ఆవేదన వ్యక్తం చేశారు.

అంతకుముందు అసెంబ్లీ లో టీడీపీ బహిష్కృత ఎమ్మెల్యే వల్లభ నేని వంశీకి మైక్ ఇవ్వడం పై టీడీపీ ఎమ్మెల్యే లు అభ్యంతరం వ్యక్తం చేయడం పై స్పీకర్ స్పందిస్తూ పై విధంగా వ్యాఖానించారు. నాడు చంద్రబాబు చేసిన పాపం లో తాను భాగస్వామి గా ఉన్నానని, ఆ విషయం లో ఇప్పటికీ బాధపడుతున్నట్లు చెప్పారు. స్పీకర్ స్థానం లో ఉన్న తమ్మినేని ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం పై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సభలో తనకు గల హక్కుల గురించి స్పష్టంగా తెలుసని, తనకు ఎవరి సలహాలు అవసరం లేదన్నారు. తనకు ఉన్న పరిధులు తెలుసని, అలాగే తనకు ఉన్న విశిష్ట అధికారాలు కూడా తెలుసునని అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp