క్షీణించిన వరవరరావు ఆరోగ్యం

By Krishna Babu Jul. 03, 2020, 03:40 pm IST
క్షీణించిన వరవరరావు ఆరోగ్యం

కొంతకాలంగా విరసం నేత వరవరరావు ఆనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మహారాష్ట్రలోని తాలోజా జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్య మరింత విషమించినట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ తలోజా జైలు అధికారులు ఫోన్ ద్వారా వరవరరావు కుటుంబసభ్యులకు కూడా సమాచారం అందించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం జైలులో ఉన్న ఆసుపత్రిలోనే వరవరరావుకు చికిత్స అందిస్తునట్టు అధికారులు వెళ్లడించారు.

భీమాకోరేగావ్ కుట్ర కేసుకులో అభియోగాలు ఎదుర్కుంటున్న వరవరరావు  కొద్ది రోజుల క్రితమే ఆరోగ్యం సరిగా లేదంటూ బెయిల్ కోసం మహారాష్ట్ర కోర్టులో పిటీషన్ దాఖలు చేయగా కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేసింది. భీమాకోరేగావ్ కుట్రలో వరవరరావు పాత్ర కీలకం అని ఆయనకు బెయిల్ ఇవ్వరాదని ఎన్.ఐ.ఏ కోర్టుకు తెలిపింది. 2018లో అరెస్టు అయి జైలులో ఉన్న వరవరరావు ఆరోగ్యం  ప్రస్తుతం క్షీణించిందన్న నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp