పాప‌డాలు తింటే క‌రోనా రాద‌న్న‌ మంత్రికి క‌రోనా

By Kalyan.S Aug. 09, 2020, 02:20 pm IST
పాప‌డాలు తింటే క‌రోనా రాద‌న్న‌ మంత్రికి క‌రోనా

పాప‌డాలు తింటే క‌రోనా పోతుంద‌ని స‌ల‌హాలు ఇస్తూ విమ‌ర్శ‌ల‌పాలైన‌ కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌ ఇప్పుడ‌దే వైర‌స్ బారిన ప‌డ్డారు. శ‌నివారం ఆయ‌న‌కు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కాగా ప్ర‌స్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటున్నారు. త‌న‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌గానే ప‌రీక్ష‌లు చేయించుకున్నాన‌ని కేంద్ర‌ మంత్రి తెలిపారు. మొద‌టి సారి నెగెటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ రెండోసారి చేసిన ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చింద‌న్నారు. త‌న‌ను క‌లిసిన వారంద‌రూ వెంట‌నే ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆయ‌న‌ సూచించారు. అర్జున్ రామ్ మేఘ్వాల్‌ బిక‌నీర్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

క‌రోనాపై భ‌య‌మెందుకు.. పాప‌డ్ తినండి చాలు..

పంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను భాబీజీ పాపడ్‌ పారదోలుతుందని కేంద్ర మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్ గ‌తంలో వెల్ల‌డించారు. ఈ పాపడ్‌ను ఆయన మార్కెట్‌లో ప్రవేశపెడుతున్న వీడియో అప్ప‌ట్లో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మేఘ్వాల్‌ కేంద్ర జలవనరులు, గంగా ప్రక్షాళన, పార్లమెంటరీ మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలో మేఘ్వాల్‌ భాబీజీ పాపడ్‌ను చూపుతూ కనిపించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ క్యాంపెయిన్‌లో భాగంగా కరోనా వైరస్‌తో పోరాడే యాంటీబాడీలను ప్రేరేపించేందుకు ఊతమిచ్చేలా ఈ ఉత్పత్తిని పాపడ్‌ తయారీదారులు ప్రజల ముందుకుతీసుకువచ్చారని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఉత్పత్తిని చేపట్టిన తయారీదారుల‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ఆ ప్రొడ‌క్ట్ లో వ్యాధినిరోధకశక్తిని పెంచే పలు పదార్ధాలు ఉన్నాయని ఈ పాపడ్‌ను తయారుచేస్తోన్న బికనీర్‌కు చెందిన కంపెనీకి ఆయన వ‌త్తాసు ప‌లికారు. మహమ్మారిపై పోరాటంలో అసత్య, అశాస్త్రీయ సమాచారాన్ని ప్రచారం చేస్తున్న అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌పై సుమోటోగా చర్యలు చేపట్టాలని ఈ వీడియోను పోస్ట్‌ చేసిన ఓ నెటిజన్‌ గతంలో కోరారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp