ఇ అంటే ఇసుక‌....ఇ అంటే ఇంగ్లీష్

By Sodum Ramana 14-11-2019 06:50 PM
ఇ అంటే ఇసుక‌....ఇ అంటే ఇంగ్లీష్

ఈ వేళ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రెండు అంశాల మీద రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. 'ఇ అంటే ఇసుక‌...ఇ అంటే ఇంగ్లీష్'  అని సీనియ‌ర్ రాజ‌కీయ నేత, మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చ‌మత్క‌రించారు. గురువారం ఆయ‌న మీడియా ముందుకు వ‌చ్చారు. త‌న‌దైన శైలిలో ఉండ‌వ‌ల్లి పాల‌క ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు హిత‌వు ప‌లికారు.

"నీ పిల్ల‌లు, నా పిల్లలు అందరి పిల్ల‌లు ఇంగ్లీష్ మీడియం చ‌దువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ల వాళ్లు వ్యాపారం కోసం ఇంగ్లీష్ మీడియం పెడుతారు. ఆ ప్రైవేట్ స్కూళ్లు పెట్టేవాళ్లు ఎవ‌రైనా తెలుగు మీడియం పెట్టారా? రాష్ర్ట మొత్తంలో అలాంటివి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇంగ్లీష్ మీడియ‌మే ఎందుకు పెడుతున్నారంటే జ‌న‌మంతా అందులో చేర‌డానికి సిద్ధ‌ప‌డుతున్నారు. ప్ర‌భుత్వ బ‌డుల్లో జ‌గ‌న్ స‌ర్కార్ ఇంగ్లీష్ మీడియాన్ని ప్ర‌వేశ పెట్ట‌డాన్ని త‌ప్పు ప‌ట్టాల్సిన అవ‌స‌రం లేదు. తెలుగు కంప‌ల్స‌రీ చేస్తాన‌ని జ‌గ‌న్ చెప్పారు. అలాగే ప్రైవేట్ స్కూళ్ల‌లో కూడా తెలుగును కంప‌ల్స‌రీ చేయాలి" అని రాష్ర్ట ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి అరుణ్‌కుమార్ గ‌ట్టి మ‌ద్ద‌తు ఇచ్చారు.

అయితే తెలుగుకు సంబంధించి ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న తప్పు కాదన్నారు. ఉపాధ్యాయుల‌కు శిక్ష‌ణ ఇవ్వాల‌ని ఆయ‌న సూచించారు. జ‌గ‌న్ స‌ర్కార్ ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. జ‌న‌వ‌రి నుంచి ఉపాధ్యాయుల‌కు ఆంగ్ల బోధ‌న‌పై శిక్ష‌ణ ఇచ్చేందుకు ప్ర‌ణాళిక రూపొందించింది.
నీకెంత మంది పెళ్లాలు, మ‌ట్టికొట్టుకుపోతావ్ లాంటి మాట‌లు అన‌వ‌స‌ర‌మ‌ని పాల‌క ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఆయ‌న హిత‌వు ప‌లికారు. ఇలాంటి ఆరోప‌ణ‌లు దిగజారుడుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా మీరు త‌న్నుకోవ‌డం మానేయాల‌ని ఆయ‌న అంద‌రికీ సూచించారు. త‌ప్పుల‌ను బ‌య‌ట‌పెట్టే హ‌క్కు ప్ర‌తిప‌క్షాల‌కు ఉంద‌న్నారు. అలాగే ప్ర‌తిప‌క్షాల‌ను తిట్టే టైం త‌గ్గించి, ప్ర‌జ‌ల‌కు వివ‌ర‌ణ ఇచ్చేందుకు వినియోగించుకోవాల‌ని ఆయ‌న పాల‌క పార్టీ నేత‌ల‌కు సూచించారు.

idreampost.com idreampost.com

Click Here and join us on WhatsApp to get latest updates.

Related News