తెలుగు రాష్ట్రాల్లో ఆగని అత్యాచారాలు.. దిశ తర్వాత మరో రెండు గ్యాంగ్ రేప్ లు.. ఎందుకిలా జరుగుతోంది.?

By Amar S Dec. 09, 2019, 11:32 am IST
తెలుగు రాష్ట్రాల్లో ఆగని అత్యాచారాలు.. దిశ తర్వాత మరో రెండు గ్యాంగ్ రేప్ లు.. ఎందుకిలా జరుగుతోంది.?

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ లో దిశ అత్యాచారం, హత్య ఘటన తాలూకా ఉదంతం ఇంకా దేశ ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. దిశను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి, హత్యచేసిన నలుగురు నిందితులను కఠినంగా శిక్షించాలని దేశం యావత్తు గొంతెత్తి నినదించింది. మహిళల రక్షణకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకురావాలని, ఈ తరహా ఘటనలకు పాల్పడిన నేరస్తులను వెంటనే శిక్షలు విధించాలని డిమాండ్ చేసింది. అయితే చర్లపల్లి జైలునుంచి దిశ హత్యకేసు నిందితులను సీన్ రీ క్రియేషన్ పేరుతో ఘటనాస్థలానికి తీసుకు వెళ్లగా నిందితులు పారిపోయే క్రమంలో పోలీసులు ఎన్ కౌంటర్ చేసారు.

అయితే దిశ ఘటన జరిగి, ఎన్ కౌంటర్ జరగడానికి ముందు తెలుగురాష్ట్రాలు అట్టుడుకుతున్న సమయంలోనే 50ఏళ్ల మహిళపై ముగ్గురు దుర్మార్గులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హతమార్చిన ఘటన తూర్పుగోదావరి జిల్లాలో వెలుగు చూసింది. తూర్పుగోదావరి జిల్లా జీ . వేమవరంలో 50ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆమెను కిరాతకంగా హత్యచేసారు. ఇదంతా షాద్ నగర్ సమీపంలో దిశను సామూహిక అత్యాచారం చేసి హతమార్చిన నేరస్తులపై దేశం భగ్గుమంటున్న సమయంలోనే జరిగింది. వారిని ఉరి తీయాలని దేశమంతా డిమాండ్ చేస్తున్న సమయంలోనే జరిగింది. అయితే డిశంబర్ 7న దిశకేసులో నిందితులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి చంపేసినా అత్యాచారాల పరంపర మాత్రం ఆగలేదు.. తిరుపతిలో 8వ తేదీనే మరో ఘటన జరిగింది.. తిరుపతి దగ్గరి ముళ్లపూడిలో మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. లిఫ్ట్ ఇస్తామని నమ్మించి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. పద్మావతిపురం దగ్గర తిరుచానూరు వైపు వెళ్తున్న బైక్‌ను లిఫ్ట్ కావాలని బాలిక అడగి తనను తిరుచానూరులో విడిచిపెట్టాలని కోరింది. అయితే, ఆ యువకుడు తిరుచానూరు లో బైక్‌ ఆపకుండా ముళ్లపూడి గేట్ వద్దకు తీసుకెళ్లాడు.. బండిలో పెట్రోల్ అయిపోయిందని పక్కనే ఆపి తన ఫ్రెండ్ కి ఫోన్ చేసాడు.

అతను రాగానే పక్కనే ఉన్న పొదల్లోకి తీసుకెళ్లి వాళ్లిద్దరూ బాలికిపై అత్యాచారం చేసారు. బాధిత బాలిక ఫిర్యాదుతో కేసు నమోదుచేసి నిందితులను అరెస్ట్ చేసారు. అయితే ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా, ఎన్ కౌంటర్ చేసి చంపేసినా ఈ తరహా ఘటనలు జరుగుతుండడానికి మేధావులు, సైక్రియార్టిస్టులు పలు కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా దిశ ఘటనలో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున తన గళం వినిపించిన ఓయూ విద్యార్ధి మహిపాల్ యాదవ్ పలు విలువైన సూచనలు చేసారు. ఇలాంటి రేప్ లు చేస్తూ, అల్లరి వేషాలు చేసేవారు కచ్చితంగా పేపర్లు చదవరని, టీవీలు చూడరని తెలిపాడు.. గంజాయి, మందు, బీర్లు తాగుతూ వారిలోకంలో విహరిస్తుంటారని దిశకేసు నిందితులను చంపడం అమానవీయ ఘటనలకు పాల్పడేవారికి పడుతున్న శిక్షలు, దేశం మొత్తం స్పందిస్తున్న విధానం వారికి తెలియకపోవడం వల్లే వారలా జీవిస్తుంటారట. మందు త్రాగడం, అవకాశంగా ఎవరైనా అమ్మాయి లేదా మహిళ కనబడితే రేపులు చేయడం వంటివి చేస్తుంటారట. వీరిలాంటి వ్యక్తులు గ్రామంలో ఐదారుగురు ఉంటారని ఎక్కువగా చదువుకోనివారు ఉంటారని మహిపాల్ తెలిపారు. డ్రైవర్లుగా, చిన్నచిన్న దొంగతనాలు చేసే వ్యక్తులుగా ఉన్న ఇలాంటి వారిని కనిపెట్టి వారికి కౌన్సిలింగ్ ఇస్తూ పర్యవేక్షించాలని తద్వారా క్రిమినల్ భావజాలం కలిగిన వ్యక్తులు పోలీసులకు దగ్గరగా ఉంటే ఆటోమేటిక్ గా క్రిమినల్ భావజాలం తగ్గి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుంటా ఉంటాయని వెల్లడించాడు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp