తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్.

By Krishna Babu Jan. 21, 2020, 11:44 pm IST
తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు షాక్.

ఆంద్రప్రదేశ్ శాశన మండలిలో తెలుగుదేశానికి షాక్ తగిలింది. ఈ రోజు ఉదయం మండలి ప్రారంభం అవ్వకముందే తెలుగుదేశం మండలి సభ్యులు డొక్కా మాణిక్య వరప్రసాద్ తన పదవికి రాజీనామ చేశారు, మరొక సభ్యురాలు శమంతకమణి సభకు హాజారు కాలేదు. ఇది ఇలా ఉంటే సాయంత్రానికి తెలుగుదేశానికి మరో ఇద్దరు ఎమ్మెల్సీలు ఊహించని షాక్ ఇచ్చారు.

ఏపి శాసన మండలిలో రూల్ నెంబర్ 71పై ఛైర్మెన్ ఎం.ఏ షరీఫ్ ఓటింగ్ పెట్టగా అనుకూలంగా 27, వ్యతిరేకంగా 11 మంది ఓటు వేయగా, 9మంది తటస్థంగా ఉండిపోయారు, ఓటింగ్ లో తెలుగుదేశం విజయం సాదించినా, ఓటింగ్ కు సొంత పార్టి శాసనమండలి సభ్యులు పోతుల సునీత, శివనాధ్ రెడ్డి ఇద్దరు వ్యతిరేకంగా ఓటు వేసి షాక్ ఇచ్చారు. శివనాధ రెడ్డి ఆదినారాయణ రెడ్డి సోదరుడు కాగా , పోతుల సునీత పరిటాల రవి ముఖ్య అనుచరుడు పోతుల సురేష్ భార్య . శాసన మండలి ఛైర్మెన్ ఎం.ఏ షరీఫ్ సభను రేపటికి వాయిదా వేశారు, విభజన బిల్లుపై రేపు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp