పోతిరెడ్డిపాడు నుంచి తాగు,సాగు అవసరాల కోసం నీటిని వాడుకోవద్దా ?

By Raju VS Jul. 29, 2021, 06:00 pm IST
పోతిరెడ్డిపాడు నుంచి తాగు,సాగు అవసరాల కోసం నీటిని వాడుకోవద్దా ?

తెలంగాణా స‌ర్కారు తీరు విస్మ‌య‌క‌రంగా క‌నిపిస్తోంది. కృష్ణా జ‌లాల వినియోగం విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రి విడ్డూరంగా క‌నిపిస్తోంది. విద్యుత్ వినియోగానికి న‌దీ జ‌లాల వినియోగంలో అభ్యంత‌రం లేద‌ని చెబుతూ, తాగు, సాగు నీటి త‌ర‌లింపు అడ్డుకోవాల‌ని చూడ‌డం ఆశ్చ‌ర్యంగా మారింది. ఇప్ప‌టికే వంద‌ల టీఎంసీల నీటిని వ‌ర‌ద‌లు రాక‌ముందే తెలంగాణా ప్ర‌భుత్వం విద్యుత్పాద‌న‌కు వినియోగించ‌డం వివాదం అయ్యింది. అనేక మ‌లుపులు తిరిగిన ఈ త‌గాదాలో చివ‌ర‌కు కేఆర్ఎంబీ జోక్యం చేసుకోవాల్సి వ‌చ్చింది. కృష్ణా, గోదావ‌రి బోర్డుల‌కు పెత్త‌నం అప్ప‌గిస్తూ నిర్ణ‌యం కూడా వెలువ‌డింది.

ఈలోగా మ‌రోసారి మెలిక పెట్టే ప్ర‌య‌త్నం తెలంగాణా వైపు నుంచి మొద‌లుకావ‌డం విశేషంగా మారింది. స‌మ‌స్య ప‌రిష్క‌రించేందుకు బ‌దులుగా త‌గాదా పెంచాల‌నే ల‌క్ష్యంతో ఉన్నార‌నే వాద‌న‌కు టీఎస్ ప్ర‌భుత్వ వైఖ‌రి తార్కాణంగా మారుతోంది. రాయ‌ల‌సీమ వాసుల తాగు, సాగు నీటి అవ‌స‌రాల కోసం పోతిరెడ్డిపాడు నుంచి నీటిని త‌ర‌లిస్తుండ‌గా, దానిని అడ్డుకోవాల‌ని తాజాగా తెలంఆణా ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసింది. నీటిపారుద‌ల శాఖ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ ఈ మేర‌కు కేఆర్ ఎంబీకి లేఖ రాశారు.

తెలంగాణా ప్ర‌భుత్వం త‌రుపున గ‌రిష్టంగా విద్యుత్ ఉత్ప‌త్తి చేసేందుకు అనుమ‌తించాల‌ని కూడా కోర‌డం ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. ఇప్ప‌టికే శ్రీశైలం, నాగార్జున సాగ‌ర్, పులిచింత‌ల వ‌ద్ద కూడా టీఎస్ జెన్కో విద్యుత్ ఉత్ప‌త్తి కోసం కృష్ణా జ‌లాల‌ను వాడేసింది. దాని కార‌ణంగా జూన్ మొద‌టివారంలోనే సుమారుగా 200 టీఎంసీలు వృధాగా మారాయి. డెల్టా వాసుల అవ‌స‌రం తీర్చాల్సి ఉన్న‌ప్ప‌టికీ విద్యుత్ కోసం సాగు, తాగు నీరు కూడా అంద‌కుండా చేశారు. ఫ‌లితంగా ప్ర‌కాశం బ్యారేజ్ నుంచి విలువైన న‌దీ జ‌లాలు వృధాగా స‌ముద్రం పాల‌య్యాయి.

ఇప్పుడు కృష్ణా న‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో కురిసిన భారీ వ‌ర్షాల‌తో ఇన్ ఫ్లోస్ పెరిగాయి. సుమారుగా 5ల‌క్ష‌ల క్యూసెక్కుల నీరు శ్రీశైలం వ‌ద్ద వ‌ర‌ద నీరుగా వ‌స్తోంది. దాంతో అక్క‌డి డ్యామ్ నీటి మ‌ట్టం 884 అడుగుల‌కు చేరింది. ఇప్ప‌టికే 10 గేట్లు ఎత్తేసి సుమారు 3ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు సాగ‌ర్ వైపు వ‌దులుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి రాయ‌ల‌సీమ కి నీటి త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌య్యింది. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏపీ ప్ర‌భుత్వం కుడిగ‌ట్టున ఉన్న విద్యుత్ కేంద్రం ద్వారా ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ కేంద్రం, కేఆర్ఎంబీ ప్ర‌మాణాల‌ను అనుస‌రించింది. వాటిని ఉల్లంఘించిన తెలంగాణా ఇప్పుడు మ‌రోసారి ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప్ర‌తిపాద‌న‌ల‌తో లేఖ రాయ‌డం చూస్తుంటే రాయ‌ల‌సీమ‌కు నీటిని అందించేందుకు స‌హ‌క‌రిస్తామ‌ని గ‌తంలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఉన్న అవ‌కాశాల‌ను కూడా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టుగా ప‌లువురు భావిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp