లెబనాన్ పై బాంబ్ దాడి జరిగి ఉండొచ్చు- ట్రంప్

By Kiran.G Aug. 05, 2020, 09:45 am IST
లెబనాన్ పై బాంబ్ దాడి జరిగి ఉండొచ్చు- ట్రంప్

నిల్వ ఉంచిన ఆమోనియం నైట్రేట్ వల్ల పేలుడు-లెబనాన్ ప్రధాని హసన్ డియాబ్

మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్ నగరంలో భారీ పేలుళ్లు బీభత్సం సృష్టించాయి. నగరంలోని భవనాలు చిన్నాభిన్నం అయ్యాయి. పేలుడు సంభవించిన ప్రాంతంలో భవనాలు తునాతునకలై పోయాయి. ఈ భారీ విస్ఫోటనం వల్ల సుమారు 80 మంది ప్రాణాలు కోల్పోగా 4000 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.భవన శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

కాగా వైట్ హౌస్ వద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది బాంబు దాడి కావచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. కాగా లెబనాన్ ప్రధాని హసన్ డియాబ్ మాత్రం పోర్టు గిడ్డంగిలో సుమారు 2,750 టన్నుల అమ్మోనియం నైట్రేట్ నిల్వ ఉంచామని దాని కారణంగా పేలుడు సంభవించి ఉండొచ్చని వెల్లడించారు. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. పేలుడు సంభవించడానికి కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని లెబనాన్ సుప్రీం డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది.

కాగా పేలుడు ధాటికి బీరుట్ నగరంలో భవనాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో ఎక్కడ చూసినా భవనలు మరియు వాహనలు శిథిలాలుగా మారిపోయాయి. పరిసర భవనాల్లో కిటికీ అద్దాలు బద్దలయ్యాయి..పేలుడు ధాటికి సంబంధించిన శబ్దాలు 24 కిలోమీటర్ల దూరంలోని సైప్రస్ ద్వీపం వరకూ వినిపించినట్టు పలువురు చెబుతున్నారు..

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp