ట్రాన్స్ జెండర్స్ బిల్-2019 పై రాష్ట్రపతి సంతకం పెట్టొద్దు

By Amar S Dec. 05, 2019, 01:13 pm IST
ట్రాన్స్ జెండర్స్ బిల్-2019 పై రాష్ట్రపతి సంతకం పెట్టొద్దు

దేశంలోని ఓ వర్గం ఇప్పడు పోస్ట్ కార్డ్ ఉద్యమం నడుపుతోంది.. వేలమంది ట్రాన్స్ జెండర్లు పోస్ట్ కార్డ్ లను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పంపిస్తున్నారు. ట్రాన్స్ జెండర్స్ బిల్-2019 పై రాష్ట్రపతి సంతకం పెట్టకూడదంటూ ఇప్పుడు ఈ ఉద్యమం నడుస్తుంది. ఒకవేళ రాష్ట్రపతి ఆ బిల్ పై సంతకంపెడితే ట్రాన్స్ జెండర్ బిల్-2019 చట్టపరిధిలోకి వస్తుంది..

అస్సలు ఈ ట్రాన్స్ బిల్ ను ట్రాన్స్ జెండర్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే.. 2014లో సుప్రీంకోర్టు నల్సా తీర్పును ప్రకటించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని ట్రాన్స్ ప్రజలు స్వాగతించారు. సుప్రీం తీర్పు ప్రకారం ఎవరి వ్యక్తిగతంగా వారే నిర్ణయం తీసుకోవచ్చు వారు ట్రాన్స్ పర్సన్ అవునా.? కాదా.? అని.. దీని ఆధారంగా చేసుకుని 2014 లో తమిళనాడు డిఎంకే నాయకుడు తిరుచీ శివ ఒక ప్రైవేట్ బిల్ ను తీసుకొచ్చారు. నల్సా తీర్పుకు ఈ బిల్లుకు సారుప్యత కూడా ఉంది. ఈ బిల్లులో విద్యా, ఉద్యోగాల్లో ట్రాన్స్ పీపుల్స్ కు 2శాతం రిజర్వేషన్ ఇవ్వాలని పొందుపరిచారు. ఇండియాలో 36 సంవత్సరాల తరువాత పార్లమెంట్ లో ఒక ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం అదే మొదటిసారి. దీనిని ట్రాన్స్ ప్రజలు కూడా ఆహ్వానించారు. కానీ అది తిరస్కరించబడింది..

2016లో బిజేపి ప్రభుత్వం మళ్లీ కొన్ని మార్పులతో ట్రాన్స్ బిల్ ను ప్రవేశపెట్టింది. అయితే ఈ బిల్ లోక్ సభ ఆమోదం పొందలేదు. ఈ బిల్లును ట్రాన్స్ పీపుల్ తీవ్రంగా వ్యతిరేకించారు. సుప్రీం ఇచ్చిన నల్సా తీర్పుకు ఈ బిల్లుకు పొంతన లేదని వారు ఆరోపించారు. అసలు మమ్మల్ని సంప్రదించకుండా, మా సమస్యలను తెలుసుకోకుండా ఎలా బిల్ పెడుతారంటూ దేశమంతటా ట్రాన్స్ కమ్యునిటీ ప్రజలు నిరసన తెలియజేశారు. స్క్రీనింగ్ కమిటీ ముందు హాజరై ట్రాన్స్ అని నిరూపించుకోవాలని ఆ బిల్లులో ఉంది. దీనిని ట్రాన్స్ కమ్యునిటీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. వ్యభిచారం, యాచకం చేస్తే అరెస్ట్ చేయచ్చని, ట్రాన్స్ పీపుల్ తమ తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండాలని 2016 ట్రాన్స్ బిల్ లో ఉంది.. దీని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.

మళ్లీ 2019 ఆగష్టు 5న రాజ్యసభలో ట్రాన్స్ జెండర్ పర్సన్స్ బిల్-2019 ఆమోదం పొందింది. నవంబర్ 26 న ఈ బిల్ లోక్ సభలోను ఆమోదం పొందింది. రాజ్యసభలో బిల్ పాస్ అయ్యినపుడు ఆర్టికల్ 370 అంశం, లోక్ సభలో బిల్ పాస్ అయినపుడు మహారాష్ట్రలో రాజకీయాలపై అందరూ ఫోకస్ చేయడం వల్ల ఈ ట్రాన్స్ బిల్ పై ఎక్కువ చర్చ జరగలేదు. ఎవ్వరికి పెద్దగా తెలియలేదు. ఇప్పుడు ఈ బిల్ పై రాష్ట్రపతి సంతకం పెడితే ఇది చట్టరూపం దాల్చుతుంది.. ఈ బిల్ ను ట్రాన్స్ పీపుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే రాష్ట్రపతికి పోస్ట్ కార్డులు పంపుతూ ఉద్యమం మొదలుపెట్టారు.

2016లో ప్రవేశపెట్టిన బిల్ పై వ్యతిరేకత రావడంతో కొన్ని మార్పులు చేశారు అయిన ట్రాన్స్ కమ్యునిటి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని అంశాలను వారు ప్రశ్నిస్తున్నారు. ట్రాన్స్ తనను నిరూపించుకోవాంటే జిల్లా మెడిస్ట్రేట్ నుండి ట్రాన్స్ జెండర్ అని సర్టిఫికెట్ తెచ్చుకోవాలి. ఈ ప్రాసెస్ లో జిల్లా మెజిస్ట్రేట్ ట్రాన్స్ మెన్ కానీ ఉమెన్ తమకు జరిగిన సర్జరీ ఆపరేషన్ సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. ఒక వేళ మెజిస్ట్రేట్ తమ అప్లికేషన్ రిజక్ట్ చేస్తే ఎందుకు చేశాడో చెప్పాల్సిన అవసరం లేదు.. మరో సమస్య ఈ బిల్ లో ట్రాన్స్ జెండర్ పీపుల్స్ కు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ డిఎంకే నేత తిరుచీ శివ రూపొందించిన బిల్ లో ట్రాన్స్ కి 2 శాతం రిజర్వేషన్ ఉంది. ట్రాన్స్ కమ్యూనిటి ప్రజలు వారి తల్లిదండ్రుల దగ్గరే పెరగాలని ఉంది దీనిని కూడా వ్యతిరేకిస్తున్నారు. తల్లిదండ్రులు తమని వద్దనుకుని వెళ్లగొడతారు మేము వచ్చి మీరు పెట్టే స్వచ్చంద సంస్థలో పెరగాల అని ప్రశ్నిస్తున్నారు.

అలాగే ట్రాన్స్ కమ్యునిటీ పై దాడి చేస్తే ,వారిని చిత్రహింసలు పెడితే చేసిన వారికి 2 సంవత్సరాల జైలు శిక్ష ఉంది. దీనిని కూడా వారు వ్యతిరేకిస్తున్నారు అమ్మాయిలకు ఇదే విదంగా జరిగితే 10 సంవత్సరాలు శిక్ష విదిస్తారు.. మరీ మమ్మల్ని వేదిస్తే 2 సంవత్సరాలలోపు శిక్షా అంటు ఈ బిల్ పై వ్యతిరేకంగా ట్రాన్స్ పోరాడుతున్నారు. తమ ప్రమేయం, అభిప్రాయం లేకుండా ఇష్టమొచ్చినట్టు బిల్ తీసుకురావడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు, పవిత్ర ధర్మాసనం ఇచ్చిన నల్సా తీర్పుకు ఇది పూర్తి వ్యతిరేకమని ట్రాన్స్ కమ్యూనిటి ప్రజలు ఆరోపిస్తున్నారు, అందుకే రాష్ట్రపతి ట్రాన్స్ జెండర్ పీపుల్ బిల్-2019 పై సంతకం చేయకుండా తిరిగి లోక్ సభకు పంపాలని వారు కోరుకుంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp