అందని ద్రాక్ష పుల్లన !!

By Nehru.T Nov. 26, 2020, 10:25 am IST
అందని ద్రాక్ష పుల్లన !!

తాడిచెట్టు ఎందుకు ఎక్కావురా అంటే దూడకు గడ్డి కోయడానికి అన్నాడట. తాడిచెట్టుకు, గడ్డికి సంబంధం లేకపోయినా ఏదోటీ సాకు చెప్పి తప్పించుకోవడమే అక్కడ ప్రధానోద్దేశ్యం అన్నమాట. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. దుర్గాప్రసాద్ మరణంతో ఖాళీ అయిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి సత్తాచాటాలని జనసేన అధి నేత పవన్ కళ్యాణ్ ఉవ్విళ్లూరుతూ వచ్చారు. అయితే ఆయన ఆశలపై బీజేపీ నీళ్లు జల్లేసింది. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీకి భేషరతుగా మద్దతు ప్రకటించిన పవన్, అదే విధంగా తిరుపతిలో బీజేపీ నుంచి సపోర్ట్ ఆశించారు.

ఆక్కడ మీరు... ఇక్కడ నేను అన్న కాన్సెప్ట్ తో ముందుకు పోదామని ఆయన భావన. కానీ ఆయన ఆలోచనలను బీజేపీ ఖాతరు చేయలేదు. దీనికి సూచనగా అనేందుకుగాను పవన్, నాదెండ్ల మనోహర్ ఇద్దరూ కలిసి ఢిల్లీలో రెండ్రోజులు మకాం వేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెండ్ జేపీ వడ్డా కుదిరితే హోం మంత్రి అమిత్ షాతో మాట్లాడి ఈ విషయం సెటిల్ చేసుకుందామన్న ఆలోచనతో అక్కడికి వెళ్లారు, అయితే పవన్ అవసరాన్ని ఢిల్లీ పెద్దలు గుర్తించలేదు. రెండ్రోజుల వెయిటింగ్ అనంతరం బుధవారం సాయంత్రం కాసేపు వారు నడ్డాతో సమావేశమయ్యా రు. బయటికొచ్చాక అబ్బే మాకు తిరుపతి ఉప ఎన్నిక ప్రాధాన్యతాంశం కానేకాదు. కేవలం ఆంధ్ర ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యం, అమరావతి, పోలవరం వంటి అంశాల మీద చాలా లోతుగా చర్చించాం.. బీజేపీతో కలిసి ముమ్మందు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాం, అంటూ నాలుగు పొడిముక్కలు మాట్లాడి పవన్ ముగించారు.

వాస్తవానికి జరిగిందేమిటంటే తిరుపతిలో తాము తప్పనిసరిగా పోటీ చేస్తామని, ఆ విషయంలో వెనక్కు తగ్గేది లేదని బిజెపి చెప్పేసింది. పైపెచ్చు 1999లో టిడిపి మద్దతులో వెంకటస్వామి ఎంపీగా గెలిచారు కాబట్టి తిరుపతిలో తమకే ఎక్కువ బలం ఉందని బీజేపీ భావిస్తోంది. ఇక ఢిల్లీ వెల్లి, కోరుకున్న పని జరక్కపోవడం తో పవన్ కు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అలాగని ఉన్న పళంగా బీజేపీని తిట్టిపోసి వెనక్కు వచ్చేసే తెగింపు లేదు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, ఏదో ఒక పార్టీని నమ్ముకుని ఉండడం తప్ప తనకు వేరే దారి లేనందున వెంటనే ప్లేట్ మార్చేశారు. ద్రాక్షపళ్లు అందని తరుణంలో ఆబ్చే అవి పుల్ల..పుల్ల..అందుకే నేను తినను అని తప్పించుకునే తీరున పవన్ కూడా తాము వెళ్లించి తిరుపతి ఎంపీ సీటు గురించి మాట్లాడేందుకు కాదని, రాష్ట్ర వ్యవహారాల గురించి చర్చించేందుకని చెప్పి ప్పించుకున్నారు. ఏదోటి.. మొత్తానికి పవన్ కు తన సత్తా , బలం ఏమిటో తెలిసి వచ్చింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp