సోషల్ మీడియాలో నాయకుల ఆదరణను తేల్చే చెక్ బ్రాండ్

By Krishna Babu Nov. 24, 2020, 09:15 pm IST
సోషల్ మీడియాలో నాయకుల ఆదరణను తేల్చే చెక్ బ్రాండ్

గత 10 సంవత్సరాలలో, డిజిటల్ రంగ పరిధి వెబ్‌సైట్, ఎస్ఎంఎస్, మెయిల్స్ నుండి మరింత విస్తృతమైంది అనడంలో సందేహంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రస్తుత డిజిటల్ ప్రపంచాన్ని ఏలుతున్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రచారం కూడా వీధి గోడలు దాటి ఫేస్బుక్ గోడల మీద ప్రత్యక్షం అయ్యాయి . ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలు వాటి అనుబంధ సంస్థలు అనివార్యంగా డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టడం తో, సామాన్య ప్రజలకు సైతం నాయకుల పై తమ అభిప్రాయాలను నిర్భయంగా సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం ప్రారంభించారు. అలాగే విప్లవాత్మక నిర్ణయాలతో సామాజికపరంగా నాయకులు తీసుకుని వస్తున్న అనేక సంస్కరణలను ఈ డిజిటల్ ప్లాట్ఫారాల ఆధారంగా ఆసక్తికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

డిజిటల్ రంగం కొత్త పుంతలు తొక్కడంతో అనేక సంస్థలు సైతం డిజిటల్ మీడియా సంస్థలను ప్రారంభించి అనేక కంపెనీలకు వారి బ్రాండ్ ను ప్రమోట్ చేయడానికి డిజిటల్ సేవలు అందిస్తూ ఉన్నారు, అలాగే దేశంలో ఉన్న ప్రజలు పలు విభాగాల్లో ఉన్న వ్యక్తులపై ఎంత ఆసక్తికరంగా ఉన్నారు. వారి చర్యలను తెలుసుకొనేందుకు ఎంత శ్రద్ద చూపుతున్నారు అనే డేటా ని సైతం క్రోడీకరించి ప్రభావిత వ్యక్తుల జాబితాను తయారు చేసి ప్రజలకు తెలిసేలా స్వచందంగా తెలియజేస్తూ ఉంటారు. ఇందులో భాగంగానే చెక్ బ్రాండ్ అనే డిజిటల్ మీడియా అనాలసిస్ సంస్థ గడిచిన ఆగస్టు నెల నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ ను నివేదిక రూపంలో వెళ్లడించింది. ఆ నివేదికలో సోషల్ మీడియాలో ప్రజాదరణ కలిగిన రాజకీయ నేతలుగా భారతదేశంలో మొదటి స్థానంలో 2,171 ట్రెండ్స్ తో ప్రధాని మోడి ఉండగా ఇక రెండవ స్థానంలో2,137 ట్రెండ్స్ తో ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారని వెళ్ళడించింది . ఆ తదుపరి స్థానలలో పశ్చిన బెంగాల్ ముఖ్యమంత్రి , కాంగ్రెస్ నేతలు రాహుల్ , సోనియా ఉన్నట్టు నివేదికలో పేర్కోన్నారు.

తాజాగా ట్రెండ్స్ రిపోర్ట్ విడుదల చేసిన చెక్‌బ్రాండ్ సంస్థ నేపధ్యం చూస్తే వివిధ కంపెనీలతో కుదుర్చుకున్న ఒప్పందం ఆదారంగా సోషల్ మీడియా, న్యూస్, బ్లాగులు మొదలైన డిజిటల్ ప్లాట్ఫాంలలో సదరు కంపెనీల ఉనికిని గణంకాలతో లెక్కించి వారు ఈ డిజిటల్ ప్లాట్ఫాంల ఆదారంగా ఇంకా ఎంత సమర్ధవంతంగా ప్రజల్లోకి వెళ్లవచ్చు అనేదానికి సలహాలు సూచనలను ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలి అంటే ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీల బ్రాండ్ విలువను పెంపొందించే పని చేస్తుంది. ఇలా సదరు బ్రాండ్స్ కే కాక భారతదేశంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలకు రీచ్‌లు ఆదారంగా ర్యాంకింగ్‌ను ఇస్తుంది. అంతే కాక చెక్‌బ్రాండ్ సంస్థ అడ్వాన్సుడ్ ఏ.ఐ టూల్ ఆధారంగా స్వచందంగా రాజకీయ నాయకులు, నటులు, క్రికెటర్లు, మంత్రిత్వ శాఖలు ఇంకా సమాజంలో ప్రభావితం చేసేవారు మొదలైన విభాగాలలో నెలవారీ ప్రాతిపదికన మొదటి 100 మంది ప్రభావశీలులను ఈ కంపెనీ విశ్లేషించి రిపోర్టులు ఇస్తుంది. ఇందులో భాగంగానే గడిచిన ఆగస్టు నెల నుంచి అక్టోబర్ వరకు సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ లో ప్రధాని మోడి, ఏపీ సియం జగన్ హవా కొనసాగుతోందని తన నివేదికలో వెల్లడించింది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp