రోగి ఆరోగ్యం బాగైన తరువాత డిశ్చార్జ్ చేయడం తప్పా..? ముద్దాయిని జైల్లో పెట్టడం తప్పా..?: టిడిపికి మాత్రం తప్పే..!

By Jagadish J Rao Jul. 02, 2020, 10:52 pm IST
రోగి ఆరోగ్యం బాగైన తరువాత డిశ్చార్జ్ చేయడం తప్పా..? ముద్దాయిని జైల్లో పెట్టడం తప్పా..?: టిడిపికి మాత్రం తప్పే..!

ఒక రోగి ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు రోగం తగ్గినాక..ఆరోగ్యం కుదుటు పడినాక డిశ్చార్జ్ చేస్తారు. ఇది ఎక్కడైనా జరిగేదే. అలాగే ఒక అవినీతి కుంభకోణంలో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని జైళ్లలో పెట్టడం కూడా సర్వసాధారణమే. అయితే ఇక్కడ ఆ రెండు అంశాలకు సంబంధం ఉన్న వ్యక్తి గురించి తెలుసుకోవాలి. మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత అచ్చెన్నాయుడు ఎపిసోడ్ గురించి మాట్లాడుకోవాలి.

గత టిడిపి ప్రభుత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఈఎస్ఐలో ఓపెన్‌ టెండర్లు పిలవకుండా నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల రూ.237 కోట్ల విలువైన ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి కుంభకోణంలో అచ్చెన్నాయుడును జూన్ 12న అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో ఆయనను అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చారు. అయితే అచ్చెన్నాయుడు అప్పటికే శాస్త్ర చికిత్స చేసుకోవడంతో ఆయనను గుంటూరు జిజిహెచ్ లో చేర్చారు.

అప్పటి నుంచి ఆయన జిజిహెచ్ లోనే ఉన్నారు. ఆయనను విచారించేందుకు ఎసిబి కోర్టు అనుమతి ఇవ్వడంతో ఎసిబి అధికారులు ఆయనను జిజిహెచ్ లోనే విచారిస్తూ వచ్చారు. అయితే ఆయన ఆరోగ్యం బాగుందని రిపోర్టన్ని స్పష్టం చేయడంతో అచ్చెన్నాయుడును దాదాపు 20 రోజుల తరువాత జిజిహెచ్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అక్కడ నుంచి జూన్ 1 విజయవాడ ‌సబ్ జైలుకు తరలించారు. ఇందులో అన్ని కూడా జరగాల్సిన రీతిలోనే జరిగాయి. ఎక్కడా కక్షపూరితం లేదు. ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలో ‌చేరారు. ఆరోగ్యం కుదుటుపడిన తరువాత ఏకంగా 20 రోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. ఇందులో అన్యాయం, అక్రమం ఎక్కడుందీ..? ఇక ఆయన ఒక కుంభకోణంలో ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి జైలుకు పంపించారు. ఇందులో అన్యాయం, అక్రమం, అప్రజాస్వామ్యం ఎక్కడుందీ..?

అయితే టిడిపి అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలు అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేసి, జైలకు పంపడంపై గగ్గోలు పెడుతున్నారు. అదేదో తప్పన్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం..? ఈ గగ్గోలు ఎందుకో ఎవరికీ అర్థం కావటం లేదు. జిజిహెచ్ నుంచి అచ్చెన్నాయుడును బలవంతంగా డిశ్చార్జ్ చేయడాన్ని చంద్రబాబు ఖండించారు. తప్పుడు సమయం వేసి అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయడం హేయమన్నారు. ఎందుకు ఖండించడమో బోధపడటం లేదు. అనారోగ్యం తగ్గిన తరువాత డిశ్చార్జేగా చేస్తారు..? దీంట్లో ఖండించడానికేముందీ..? అంటే ఆరోగ్యం కుదిటపడిన తరువాత కూడా డిశ్చార్జ్ చేయకూడదా...? ఆయనను ఆసుపత్రిలోనే ఉంచాలా...? డిశ్చార్జ్ తప్పుడు సమయం, ఒప్పు సమయం ఉంటుందా..? ఏ రోగైనా ఎంత త్వరగా డిశ్చార్జ్ చేస్తే...అంత మంచిదిగా ఫీలవుతారు. కాని ఆరోగ్యం బాగున్నాక కూడా ఆసుపత్రిలోనే ఉంటామంటున్న, ఉండాలని అంటున్న నేతలను మాత్రం టిడిపిలోనే చూస్తాం. ఆరోగ్యం బాగున్నాక డిశ్చార్జ్ చేస్తే చంద్రబాబు హేయమంటున్నారు..!‌ఇదేందో అర్థం కావడం లేదు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత ఇలా మాట్లాడటం దారుణం.

ఇంకా మరో టిడిపి నేత, తానే మేథావుని అని పరోక్షంగా ప్రచారం చేసుకొనే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అయితే అచ్చెన్నాయుడు డిశ్చార్జ్ కు కూడా కులం అంటించాడు. అచ్చెన్నాయుడు అరెస్టుకు కులానికి, ఆయన డిశ్చార్జ్ కు కులానికి ఏమైనా సంబంధం ఉందా..? ఆయన కుంభకోణంలో ఉన్నాడు కనుకు అరెస్టు అయ్యాడు. ఆయన ఆరోగ్యం బాగుంది కనుక ఆయనను డిశ్చార్జ్ చేశారు. ఈ కనీస జ్ఞానం కూడా లేకుండా యనమల మాట్లాడుతున్నారని వైసిపి నేతలు ధ్వజమెత్తుతున్నారు.

ఇంకో టిడిపి‌ నేత, చంద్రబాబు తనయుడు లోకేష్ బాబు ఒకడుగు ముందుకేసి ఏకంగా డిశ్చార్జ్ కి, సిఎం జగన్మోహన్ రెడ్డికి అంటగలిపాడు. సంబంధం లేని అంశాలను అంటగలపడంలో టిడిపి‌నేతలకు మరెవరూ సాటిరారని మరోసారి నిరుపితం అయింది. అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడును డిశ్చార్జ్ చేయకుండా ఆసుపత్రిలోనే ఉంచి..ప్రభుత్వం ఖర్చు చేయాలా..? ఆసుపత్రిలో అనారోగ్యంతో ఉన్నోడు ఉంటాడు గాని, ఆరోగ్యంతో ఉన్నోడు ఎక్కడైనా ఉంటారా..? టిడిపి నేతలే ఉంటారేమో కాని, ప్రజలెవ్వరూ ఆరోగ్యంతో ఆసుపత్రిలో ఉండాలనుకోరు..!

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp