టీడీపీపై ‘విశాఖ’ ప్రభావం

By Jaswanth.T Sep. 27, 2020, 05:40 pm IST
టీడీపీపై ‘విశాఖ’ ప్రభావం
ఏపీకి ప్రకటించిన మూడు రాజధానుల్లోనూ ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా విశాఖను ప్రకటించిన సీయం వైఎస్‌ జగన్, దాని సంబంధిత పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే న్యాయ వ్యస్థలను అడ్డుపెట్టుకుని ఈ ప్రయత్నానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అడ్డుతగులుతోందని అధికార పార్టీ నాయకులు బలంగానే ఆరోపిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు కూడా అమరావతికే కట్టుబడి ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విశాఖ జిల్లా తెలుగుదేశం ప్రభుత్వంలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలు ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి.

ఒకప్పుడు విశాఖజిల్లా, రూరల్‌ జిల్లాల్లో అధ్యక్ష పదవుల కోసం పోటీ పడ్డ నేతలంతా ఇప్పుడు ఆ పార్టీని విడిచిపెట్టి వైఎస్సార్‌సీపీ బాటపడుతున్నారు. ఇందుకు వారు చెబుతున్న ప్రధాన కారణం సీయం జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించమేనంటున్నారు. దీంతో విశాఖ జిల్లా నేతలు బాహాటంగానే చెబుతున్న అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అంతర్లీనంగా బలంగానే ఉందన్న వాదనలు కూడా విన్పిస్తున్నాయి. అదే విధంగా ప్రజల్లో సైతం విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాధాని అంశంపై సానుకూల స్పందననే వెలిబుచ్చారంటున్నారు. అయినప్పటికీ చంద్రబాబు అనుసరిస్తున్న ‘అమరావతి’ ధోరణితో వారందరిలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోందన్న అభిప్రాయం చివరగా చెబుతున్నారు.

నిజానికి 2019 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు ప్రజల నాడిని పట్టడంలో ఇతర నాయకులకంటే ముందుండేవారని చెబుతారు. అయితే ఆ ఎన్నికల్లో వేసిన అంచనాలు ఎంత ఘోరంగా ఫెయిల్‌ అయ్యాయో ఫలితాలే తేల్చిచూపాయి. వేసిన అంచనాలు ఇంత ఘోరంగా దెబ్బతినడానికి గ్రౌండ్‌ లెవల్‌కి వెళ్ళి పరిశీలించకపోవడమేనన్నది చెబుతున్నారు. ఇప్పుడు కూడా విశాఖ రాజధాని అంశంపై కనీసం పరిశీలన కూడా చేయకుండా ఏకోన్ముఖంగా అమరావతివైపే మొగ్గు చూపడం సొంత పార్టీ నాయకులకే రుచించడం లేదు. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే విశాఖ టీడీపీలో సంక్షోభం కొనసాగుతోందని వివరిస్తున్నారు.

అనూహ్య ప్రజా మద్దతుతో అధికారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ విశాఖను ఎగ్జిక్యూటివ్‌ రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజల చూపు విశాఖవైపునకు తిరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇక్కడ జరిగే ప్రతి అంశాన్ని ఆసక్తితోనే వారంతా పరిశీలిస్తుంటారు. అటువంటప్పుడు అక్కడ టీడీపీ ప్రభుత్వం ఎదుర్కొంటున్న దుస్థితిని దేశం మొత్తంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని సొంత పార్టీ నాయకులు కూడా పరిశీలించుకుంటున్నారు. దీంతో తమ స్టాండ్‌ను పక్కాగా నిర్ణయించుకునేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నది రాజకీయవర్గాల్లో విన్పిస్తున్న మాట. ఇదే నిజమైతే గనుక విశాఖలో ఎదుర్కొంటున్న ఫలితాలనే రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఎదుర్కొవాల్సిన పరిస్థితులు వచ్చినా వస్తాయంటున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp