Ganja-ఏ మాత్రం బుర్ర పెట్టకుండా 'గంజాయి'లో కాలేసిన టీడీపీ!

By Balu Chaganti Oct. 22, 2021, 10:15 am IST
Ganja-ఏ మాత్రం బుర్ర పెట్టకుండా 'గంజాయి'లో కాలేసిన టీడీపీ!

విశాఖ ఏజెన్సీ పేరు చెబితే ముందుగా మనకి ప్రకృతి సౌందర్యం గుర్తుకొస్తుంది. అదే సమయంలో గంజాయి వాసన కూడా గుప్పుమనే పరిస్థితి. మన్యంలో విస్తారంగా సాగవుతున్న గంజాయి దేశ,విదేశాలకు తరలిపోతోందనే చెప్పాలి. గిరిజన ప్రజలను,వారి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకొని ఈజీ మనీ సంపాదించేందుకు గంజాయి గ్యాంగ్ రెచ్చిపోతున్న క్రమంలో అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తూ పోతోంది. ఏవోబీ ప్రాంతాలు గంజాయి పంటకు అనుకూలంగా ఉంటాయి.అందుకే ఇక్కడి శీలవతి అనే గంజాయికి అత్యధిక రేటు ఉండటంతో స్మగ్లర్లు విశాఖ మన్యంను టార్గెట్‌ చేసుకుని పెద్ద ఎత్తున సాగు చేయించి అమ్ముకుంటున్నారు. గంజాయి సాగు, రవాణాకు విశాఖ మన్యం అనువైన ప్రాంతం కావడంతో తమిళనాడు, కేరళ నుంచి వచ్చి గిరిజనులతో గంజాయి సాగు చేయిస్తుంటారు. ఏటా 5 వేల కోట్లకుపైగా గంజాయి స్మగ్లింగ్ జరుగుతూ ఉంటుంది.

అధికారులు ఎంత పకడ్బందీగా చర్యలు తీసుకున్నా సరే గుట్టుచప్పుడు కాకుండా గంజాయి రవాణా జరుగుతూ ఉంటుంది. దీనికి పార్టీలతో సంబంధం ఉంటుందా అంటే సామాన్య మానవుడు కూడా లేదనే చెబుతాడు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష టీడీపీ చేస్తున్న విష ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. తెలుగుదేశం పార్టీ నేతలు సహా వారి సోషల్ మీడియా విభాగాలు సైతం ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు గంజాయి సాగు వైసీపీ ప్రభుత్వం, వైసీపీ నేతలే చేస్తున్నారు అన్నట్లుగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. గంజాయి సాగు ఎన్నో ఏళ్లుగా ఏజెన్సీ ప్రాంతాల్లో జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2014-2019 మధ్య ఎన్నో సార్లు 100 కేజీలు, కోట్ల రూపాయల మేర గంజాయి పట్టుబడింది.నాడు పట్టుబడిన గంజాయి విషయంపై పల్లెత్తు మాట అనని టీడీపీ,ప్రస్తుతం అధికారంలో వైసీపీ ఉంది కాబట్టే పట్టుబడుతున్న గంజాయి మొత్తం వైసీపీది అని ఆరోపిస్తూ వితండ వాదన చేస్తోంది.

అంటే టీడీపీ హయాంలో పట్టుపడిన మొత్తం గంజాయి టీడీపీ అమ్ముతున్నట్టే భావించాలా? నిజానికి గంజాయి వ్యవహారం గుజరాత్ పోర్టులో హెరాయిన్ పట్టుబడిన తర్వాతే తెరమీదకు తీసుకువచ్చింది టీడీపీ.. ఎందుకంటే ఆ హెరాయిన్ కు ఆంధ్రప్రదేశ్‌కు ఎలాంటి లింకులు లేవని దర్యాప్తు సంస్థలు తేల్చాయి. అయితే అప్పటికే డ్రగ్స్ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకోవాలని ఫిక్స్ అయిన టీడీపీ గంజాయి అనే అంశాన్ని వైసీపీకి ముడి పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే నిజానికి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీసులు కూడా విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ కొంతవరకు అడ్డుకట్ట వేయగలుగుతున్నా దొరికేదాని కంటే సరిహద్దులు దాటి వెళ్లేదే ఎక్కువ అవుతోంది. దీనిని ఎలా అరికట్టాలి అని ఆలోచిస్తూ పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలతో ముందుకు వస్తున్నారు. మొక్కల స్థాయిలోనే ఎక్సైజ్, పోలీస్ అధికారులు గంజాయి సాగు తోటలను ధ్వంసం చేస్తూ దీనిని అరికట్టేందుకు ప్రత్యేకంగా శాటిలైట్ ట్రాకింగ్ ఇమేజ్ సిస్టమ్‌ను కూడా అమలులోకి తీసుకు రావడానికి ప్లాన్ చేశారు. ‎కానీ పచ్చ కామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు టీడీపీ,దాని అనుకూల మీడియా గంజాయి వ్యవహారాన్ని వైసీపీకి అంటగట్టాలి అని రాక్షస ప్రయత్నం చేసి విఫలం అయింది.

Also Read : YS Jagan - ఇన్నాళ్ళూ ఒక లెక్క.. ఇకపై మరో లెక్క

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp