హైకోర్టులో అచ్చెం నాయుడు పిటిషన్‌.. బెయిల్‌ కోసం కాదు..!

By Kotireddy Palukuri Jul. 02, 2020, 07:43 pm IST
హైకోర్టులో అచ్చెం నాయుడు పిటిషన్‌.. బెయిల్‌ కోసం కాదు..!

ఈఎస్‌ఐ స్కాంలో అరెస్ట్‌ అయిన మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెం నాయుడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, తిరిగి ఆస్పతికి తరలించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ అచ్చెం నాయుడు తన లాయర్‌ ద్వారా పిటిషన్‌ దాఖలు చేశారు. ఆరోగ్యం బాగోలేకపోయినా డిశ్ఛార్జి చేసి బలవంతంగా జైలుకు తరలించారని అచ్చెం నాయుడు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. హైకోర్టులో కరోనా వల్ల రిజిస్ట్రార్‌ మరణించడం, మరో 16 మందికి పాజిటివ్‌ రావడంతో ఈ రోజు నుంచి హైకోర్టు అతవ్యసర పిటిషన్లను ఆన్‌లైన్‌లో విచారణకు స్వీకరిస్తోంది. అచ్చెం నాయుడు పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మరో వైపు అచ్చెం నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ జరుగుతోంది. రేపు బెయిల్‌ పిటిషన్‌పై మరో మారు విచారణ జరగనుంది. అయితే అచ్చెం నాయుడుకు బెయిల్‌ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారనే వాదనను ఏసీబీ వినిపిస్తోంది. అందుకని ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈఎస్‌ఐ స్కాంలో మరింత విచారణ జరగాల్సి ఉందని ఏసీబీ చెబుతోంది. ఈ వ్యవహారంలో ఏపీ సచివాలయ అధికారులకు భాగం ఉందన్న అనుమానాలు వ్యక్తం చేస్తోంది. పైగా ఇటీవల మూడురోజుల కస్టడీలో అచ్చెం నాయుడు తమ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదని చెబుతూ.. మరికొన్ని రోజులు కస్టడీని కోరింది. ఈ నేపథ్యంలోనే అచ్చెం నాయుడు హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ కాకుండా ఆస్పతికి తరలించాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరిస్కరిస్తే అప్పుడు హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp