Mahilala Athma Gouravam Sabha, Chandrababu - ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు.. బాబు నిస్సహాయతకు నిదర్శనం

By Karthik P Nov. 27, 2021, 12:08 pm IST
Mahilala Athma Gouravam Sabha, Chandrababu - ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు.. బాబు నిస్సహాయతకు నిదర్శనం

పాలించాలని ఒక పార్టీకి ప్రజలు ఐదేళ్ల పాటు అధికారం కట్టబెడతారు. పాలనలో లోపాలను ఎత్తి చూపాలని, తమ గొంతు వినిపించాలని మరో పార్టీకి ప్రతిపక్ష బాధ్యతలు అప్పగిస్తారు. అధికార పార్టీ కన్నా.. ప్రతిపక్ష పార్టీకి ప్రజల పట్ల బాధ్యత ఎక్కువగా ఉంటుంది. ఎన్నికల్లో అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోయినా, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నా.. ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా పాలన సాగిస్తున్నా.. వారి తరఫున ప్రతిపక్షం గొంతు వినిపించాలి. ప్రజల కష్టాలు, సమస్యలు, బాధలను ఎప్పటికప్పుడూ వినిపిస్తూ.. పరిష్కారానికి పని చేయాలి. ఈ ప్రాథమిక సూత్రం అన్ని రాజకీయ పార్టీలకు తెలిసిన విషయమే. ఇందులో కొత్త ఏమీ లేదు. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత బాధ్యతను నిర్వర్తిస్తున్నారా..? అంటే.. ఠక్కున లేదనే సమాధానం వస్తోంది.

చంద్రబాబు ప్రతిపక్ష నేతగా పని చేస్తున్న తీరు అత్యంత హాస్యాస్పదంగా ఉంది. ప్రజల తరఫున, ప్రజా సమస్యలపై అసెంబ్లీ లోపల, బయట పోరాటాలు చేయాల్సిన చంద్రబాబు.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఇదేనా ఆయన అనుభవం అని అందరూ మాట్లాడుకునేలా ప్రవర్తిస్తున్నారు. తాజాగా శుక్రవారం జరిగిన టీడీపీ పోలిట్‌బ్యూరో సమావేశంలో తీసుకున్న ఓ నిర్ణయం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారో తెలియజేస్తోంది. రాష్ట్రంలో డిసెంబర్‌ 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాలలో ‘‘ ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు’’ నిర్వహించాలని ఆ సమావేశంలో తీర్మానించారు. శాసన సభలో మహిళల వ్యక్తిత్వంపై ఏ విధంగా దాడి చేశారో ప్రజలకు చైతన్యం కలిగించడమే ఈ సభల లక్ష్యమని టీడీపీ పేర్కొంది.

ప్రతిపక్ష నేతగా ఎలాంటి విధులు నిర్వర్తించాలి..? చంద్రబాబు ఏం పనులు చేస్తున్నారు..? ఈ ఒక్క నిర్ణయంతోనే స్పష్టంగా అర్థమవుతోంది. అసెంబ్లీలో తన భార్యను తిట్టారని చెబుతున్న చంద్రబాబు.. తిట్టడంపై సభలు నిర్వహించి.. చర్చించాలని నిర్ణయించడం విడ్డూరంగా ఉంది. తననో లేక తన భార్యనో, కొడుకునో తిట్టారని, గౌరవ పరిచారని ఆత్మగౌరవ సభలు ఊరూవాడా నిర్వహించతలపెట్టిన రాజకీయ నేత బహుశా ఈ ప్రపంచంలో చంద్రబాబునే మొదటి, చివరి నేతగా మిగిలిపోతారనడంలో సందేహం లేదు. తాము చంద్రబాబు భార్యను ఏమీ అనలేదు.. ఏమన్నామో చెబితే.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెబుతామని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు చెప్పినా.. ఆ విషయాన్ని పట్టించుకోని బాబు.. తన దారి తనదే అంటూ ఆ విధంగా ముందుకు పోతుండడం విచిత్రంగా ఉంది.

ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు శాసన సభలో మాట్లాడాలని అడిగితే.. మైక్‌ ఇవ్వలేదని, అందుకే ప్రజా సమస్యలపై సభలు నిర్వహించాలని, ప్రజల మధ్యనే వారి సమస్యలను చర్చించాలని నిర్ణయించామని చెబితే అందరూ హర్షిస్తారు. పార్టీకి మైలేజీ వస్తుంది. కానీ చంద్రబాబు ఇవేమీ చేయలేదంటే.. రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొవడం లేదనేగా...? జగన్‌ పరిపాలన బాగుందని ఒప్పుకున్నట్లేగా..? రాజకీయ నాయకుడు ఎవరైనా సరే తననో, తన కుటుంబ సభ్యులనో తిట్టారని చెబుతూ.. దానిపై రచ్చ చేస్తే.. తమకు ఒరిగేది ఏమీ ఉండదని సాధారణ ప్రజలకు కూడా తెలుసు. ఈ విషయం బాబుకు తెలిసినా.. ఆడపడుచుల ఆత్మగౌరవ సభలు అంటూ ప్రజల్లోకి వెళితే... తన హాయంలో ఎమ్మార్వో వనజాక్షి, విజయవాడ కాల్‌మనీ రాకెట్‌ వంటి అనేక ఘటనల సంగతేంటి..? వారు మహిళలు కాదా..? వారికి ఆత్మగౌరవం లేదా..? అనే ప్రశ్నలు చంద్రబాబుకు ఎదురవుతాయి.

Also Read : Chandrababu - రెండున్నరేళ్లు సానుభూతి నిలుస్తుందా ?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp