వీడిన అంకులు హత్య మిస్టరీ

By Krishna Babu Jan. 20, 2021, 05:20 pm IST
వీడిన అంకులు హత్య మిస్టరీ

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడు టీడీపీ నేత పురంశెట్టి అంకుల్ దారుణ హత్యకి గురి కావడం తెలిసిందే . గురజాల నియోజక వర్గ టీడీపీ ఇన్చార్జ్ , మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు దగ్గరి వ్యక్తిగా పేరున్న పురంశెట్టి అంకుల్ పెదగార్లపాడు గ్రామానికి పదేళ్ల పాటు సర్పంచ్ గా వ్యవహరించారు . ఆయన సతీమణి ఐదేళ్లు సర్పంచ్ పదవి నిర్వహించగా , ఇటీవల కాలంలో ఆయన కుమారుడు కూడా టీడీపీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడు. సుదీర్ఘ కాలం నుండి రాజకీయాల్లో కొనసాగుతున్న అంకుల్ హత్య విషయం తెలిసిన వెంటనే టీడీపీ శ్రేణులు వైసీపీ పై ఆరోపణలు చేయగా , ప్రతిపక్ష నేత తనయుడు లోకేష్ అంకులు అంత్యక్రియల్లో పాల్గొని ముఖ్యమంత్రి జగన్ హత్యకు బాధ్యత వహించాలంటూ జగన్ పై , వైసీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు .

అయితే తాజాగా అంకులు హత్యవెనక ఉన్న కుట్రని పోలీసులు చేధించారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ చెప్పిన వివరాల ప్రకారం అంకులు హత్య వెనకాల ఉన్న కర్పూరపు వెంకటకోటయ్య , గుర్రం వెంకటేశ్వర రెడ్డి , చిన్న శంకర్ రావు, మేకల చినకోటేశ్వరరావు, పొట్టిసిరి అంకారావు, అద్దంకి రమేష్ లని అరెస్టు చేశామని చెప్పుకొచ్చారు. అయితే వీరిలో కోటేశ్వరావు, వెంకట కోటయ్య కలిసి అంకులు హత్యకు పథకం రచించారని, అంకులుకు ఆహారంలో మత్తు మందు కలిపి అనంతరం హత్య చేసారని, హత్యకు పాల్పడిన వారిలో ఒకరుగా ఉన్న కోటేశ్వరావు గతంలో జనశక్తి గ్రూప్ లో కీలక వ్యక్తిగా పని చేశారని. అంకులు హత్య వెనక రాజకీయ కోణం లేదని, ముగ్గురు నిందితులకు మృతుడితో ఉన్న భూతగాదాలు, ఇతర వ్యక్తిగత విభేదాల వల్లే హత్యకు ప్రణాళిక రచించారని, ఈ హత్యలో పాల్గొన్న మిగతా నిందితులకు 8 ఎకరాలు, రూ.15 లక్షల ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించారని జిల్లా ఎస్పీ విశాల్ గున్నీ వెల్లడించారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp