కాలు జారిన నన్నపనేని రాజకుమారి.. తలకు గాయం

By Kotireddy Palukuri Sep. 26, 2020, 03:08 pm IST
కాలు జారిన నన్నపనేని రాజకుమారి..  తలకు గాయం

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకురాలు, ఏపీ మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారికి గాయాలయ్యాయి. తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారీ పడ్డారు. గార్డెన్‌లో మొక్కల పని చేస్తుండగా నన్నపనేని కాలు జారారు. కింద పడడంతో గాయాలయ్యాయి. వెంటనే ఆమెను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. తలకు కట్టుకట్టారు. చికిత్స అనంతరం ఇంటికి వచ్చారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంట్లో ఉండేందుకు నన్నపనేని ఆసక్తి చూపారు. దీంతో వైద్యుల పర్యవేక్షణలో ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.

ఫైర్‌ బ్రాండ్‌గా పేరొందిన నన్నపనేని రాజకుమారి తెలుగు రాజకీయాల్లో సుపరిచితురాలు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పని చేశారు. ప్రభుత్వం మారడంతో ప్రస్తుతం ఆ పదవిలో వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఉన్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత నన్నపనేని కూడా రాజకీయంగా చురుకుగా లేరు. మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌గా ఉన్న సమయంలోనూ రాజకీయపరమైన వ్యాఖ్యలకు దూరంగా ఉంటూ హుందాగా తన బాధ్యతలను నిర్వర్తించారు. ప్రస్తుతం టీడీపీలోనే కొనసాగుతున్నా.. రాజకీయంగా సైలెంట్‌ అయ్యారు. నన్నపనేనికి గాయాలు కావడంతో పలువురు టీడీపీ నేతలు ఫోన్‌లో పరామర్శిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp