కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేయడం మూర్ఖత్వం : నారా లోకేష్‌

By Kotireddy Palukuri Jul. 04, 2020, 01:13 pm IST
కొల్లు రవీంద్రను అరెస్ట్‌ చేయడం మూర్ఖత్వం : నారా లోకేష్‌

మంత్రి పేర్ని నాని ముఖ్య అనుచరుడు, మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మోకా భాస్కర రావు హత్య కేసులో టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్‌ చేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్‌ స్పందించారు. రాజకీయాల్లో మిస్టర్‌ క్లీన్‌గా ఉన్న కొల్లు రవీంద్ర లాంటి నాయకుడిని అరెస్ట్‌ చేసి వైఎస్‌ జగన్‌ తన మూర్ఖత్వాన్ని , రక్షస మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్‌ ట్వీట్టర్‌లో ఓ పోస్టు పెట్టారు.

‘‘ బీసీలకు చేస్తున్న అన్యాయం బయటపడుతుందనే భయం జగన్‌ రెడ్డిగారిని వెంటాడుతోంది. అందుకే బలమైన బీసీ నాయకులను తప్పుడు కేసుల్లో ఇరికించి వేధిస్తున్నారు. అసమర్థ పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ఎందగడుతూ కొల్లు రవీంద్ర పోరాడుతున్నారు. కక్ష సాధింపులో భాగంగా జరిగిన కొల్లు రవీంద్ర అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల్నీ గాలికొదిలేసి అధికారాన్ని కేవలం తన కక్ష సాధింపు కోసం వినియోగించుకుంటున్నారు. ఎన్ని సార్లు చివాట్లు తిన్నా జగన్‌ రెడ్డి గారి బుద్ధి మారడం లేదు’’ అంటూ లోకేష్‌ ట్విట్టర్‌లో పోస్టులు పెట్టారు.


idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp