TDP, Andhra Jyothi, Rosaiah, YS Jagan - రోశయ్య మరణాన్ని కూడా వాడుతున్నారు.. వీళ్ళు మారరా..?

By Balu Chaganti Dec. 07, 2021, 08:30 pm IST
TDP, Andhra Jyothi, Rosaiah, YS Jagan - రోశయ్య మరణాన్ని కూడా వాడుతున్నారు.. వీళ్ళు మారరా..?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం గురించి ఇప్పుడు రాజకీయం మొదలైంది. సీనియర్ రాజకీయ నేతగా తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు మంచి పేరు ఉంది. రోశయ్యకు పార్టీలకు అతీతంగా సంతాపం ప్రకటించారు. సుప్రీం కోర్టు సీజే ఎన్వీ రమణ, తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా అధికారికంగా సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చి రోశయ్యకు నివాళులు అర్పించకపోవడాన్ని టార్గెట్ గా చేసుకుని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా ఛానళ్లు రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇది కేవలం సోషల్ మీడియా కార్యకర్తల వరకే పరిమితం అవుతుంది అనుకుంటే టీడీపీ నేత గౌతు శిరీష లాంటి వాళ్ళు కూడా సీఎం జగన్ తీరును తప్పుబడుతూ టార్గెట్ చేస్తున్నారు.

అయితే ప్రభుత్వ కార్యక్రమాలతో అధికారులతో, రివ్యూ మీటింగ్ లతో బిజీ షెడ్యూల్ తో ఉండే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్లాలంటే ముందే షెడ్యూల్ ఖరారు అవుతుంటుంది. ఒక్కోసారి సొంత కుటుంబ సభ్యుల కార్యక్రమాలకు కూడా ఆయన హాజరు కాలేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న వైయస్ జగన్ అది సీరియస్ గా తీసుకోవడం మానేశారు. అయితే మాజీ ముఖ్యమంత్రి రోశయ్య పట్ల తనకు ఉన్న గౌరవంతో మాజీ సీఎం రోశయ్య కుమారుడిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. రోశయ్యది ఆదర్శప్రాయమైన జీవితమని ఆయన కుమారుడికి భరోసా నిచ్చారు. రోశయ్య మృతికి సంతాప సూచకంగా ఏపీ ప్రభుత్వం డిసెంబర్‌ 4 నుంచి 6 వరకు సంతాప దినాలను కూడా ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం నుంచి మంత్రులు బోత్సా సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అయితే అప్పుడెప్పుడో రోశయ్య ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో చేసిన కొన్ని కామెంట్స్ ను పనిగట్టుకుని ఇప్పుడు జగన్ రాకపోవడంతో లింకు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తర్వాత ఊహించని పరిణామాల్లో తనకు ముఖ్యమంత్రి బాధ్యతలు వచ్చాయని రోశయ్య గతంలో ఇచ్చిన ఓపెన్ హార్ట విత్ ఆర్కే ఇంటర్వ్యూలో కామెంట్ చేశారు. దానిని అడ్డుపెట్టుకొని జగన్ తనకు ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి రోశయ్య కారణం అని మనసులో పెట్టుకుని ఇప్పుడు ఆయన చనిపోయినా కడసారి చూసేందుకు వెళ్లలేదని కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే జగన్ కు రోశయ్య మీద కోపంగా ఉంటే సంతాప దినాలుగా ప్రకటించడం, ఆయన కుమారుడు కి ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేయడం, మంత్రులను పంపడం కూడా చేసేవారు కాదు కదా. అలాగే సోషల్ మీడియా వేదికగా, పత్రికా ముఖంగా కూడా సంతాపం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. ఆయన కేవలం తన బిజీలో తాను ఉండి ప్రజల కోసం పని చేస్తుంటే దానిని ఇప్పుడు ఏదో జరిగిపోయింది అన్నట్లు కామెంట్లు చేయడం నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఎక్కడ జగన్ దొరుకుతారా? ఎలా ట్రోల్ చేయాలా ? అని టీడీపీ సోషల్ మీడియా సహా టీడీపీ అనుకూల మీడియా విపరీత పోకడలు పోతోంది.

Also Read : TDP, Chandrababu, Registrations, Village Secretariat - సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లను వ్యతిరేకిస్తున్న బాబు.. సచివాలయాలను ఎత్తేస్తానని హామీ ఇస్తారా..?

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp