టాటా చేతికి ఎయిర్ ఇండియా..?

By Venkat G Oct. 01, 2021, 12:15 pm IST
టాటా చేతికి ఎయిర్ ఇండియా..?

టాటా కంపెనీ జాతీయ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను సొంతం చేసుకుంది. టాటా సన్స్ ఈ ఏడాది సెప్టెంబర్లో విమానయాన సంస్థకు సంబంధించి చివరి బిడ్ దాఖలు చేసింది. ఈ బిడ్ లో మొదటి స్థానంలో నిలిచింది అని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. స్పైస్‌జెట్ ప్రమోటర్ అజయ్ సింగ్ కూడా ఎయిర్‌లైన్ కోసం బిడ్‌ను సమర్పించినప్పటికీ, టాటా సన్స్ ఎయిర్‌ లైన్ కొనుగోలు కోసం అధిక మొత్తం చెల్లించడానికి ముందుకు రావడంతో విమానయాన సంస్థను ప్రభుత్వం వర్గాలు టాటా కంపెనీకి విక్రయిస్తున్నట్టుగా ధ్రువీకరించాయి.

Read Also:-  ప‌వ‌న్ ఇక నుంచే రాజ‌కీయ నాయకుడ‌ట‌.!

ఎయిర్‌ లైన్స్ కోసం ప్రభుత్వం కనీస రిజర్వ్ ధరను ఖరారు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలు అదే విధంగా.. బ్రాండ్ విలువ మరియు విదేశీ విమానాశ్రయాలలో స్లాట్‌ల ఆధారంగా జాతీయ విమానయాన సంస్థ కు కేంద్ర ప్రభుత్వం కనీస ధరను నిర్ధారించింది. టాటా సన్స్ సమర్పించిన బిడ్ ప్రభుత్వ కమిటీ నిర్ణయించిన కనీస నిల్వ ధర కంటే రూ.3,000 కోట్లు ఎక్కువ అని జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి.

Read Also:- రాజకీయాల్లో గ్లామర్ కన్న గ్రామర్ ముఖ్యం

దాదాపుగా ఎయిర్ ఇండియా అప్పుల్లో కూరుకుపోవడం అలాగే సంస్థను విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా రెండు మూడేళ్ల నుంచి ప్రయత్నాలు చేయడం మనం వార్తలలో చూస్తూనే ఉన్నాం. విక్రయిస్తారు అని తెలిసినప్పటి నుంచి టాటా కంపెనీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తోంది. మాజీ ఎయిర్ ఇండియా డైరెక్టర్ జితేంద్ర భార్గవ ఇటీవల బ్లూమ్‌ బెర్గ్ ఇంటర్వ్యూ లో దీనికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్ ఇండియాలో తిరిగి గాడిలో పెట్టేందుకు... అందుకు అవసరమైన మొత్తంలో డబ్బును పోగేసే సామర్థ్యం ఉన్నందున టాటా కంపెనీ ప్రభుత్వం నుండి కొనుగోలు చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ఎయిరిండియా విషయంలో టాటా కంపెనీ చాలా ఆసక్తికరంగా ఉందని భార్గవ్ జాతీయ మీడియాతో అన్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp