నటుడు విజయ్ తమిళనాడుకు వై.యస్ జగన్ అంటు వెలిసిన పోస్టర్లు

By Krishna Babu Jun. 20, 2020, 08:40 pm IST
నటుడు విజయ్ తమిళనాడుకు వై.యస్ జగన్ అంటు వెలిసిన పోస్టర్లు

నటుడు విజయ్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోల్చారు విజయ్ అభిమానులు. తమిళ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు సందర్భంగా తమిళనాడు కుంభకోణంలోని అతని అభిమానులు విజయ్ ఫోటోను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కలిపి వీధుల్లో అంటించారు. విజయ్, ఈ నెల 22న 46వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.

కరోనా తమిళనాడు అంతా విపరీంతా వ్యాప్తి చెందడంతో, విజయ్ తన పుట్టినరోజు వేడుకల కార్యకలాపాలకు పాల్పడవద్దని అభిమానులను ఆదేశించారు. అయితే, అతని అభిమానులు విజయ్‌ను పుట్టిన రోజు సంధర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పోల్చుతూ భవిష్యత్ తమిళనాడు జగన్ అంటూ అభినందిస్తూ కుంభకోణం వీధుల్లో పోస్టర్లు అంటుంచారు.

విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్ కుంభకోణం మెట్రోపాలిటన్ కోశాధికారి ఈ విషయంపై మాట్లాడుతూ “తమిళనాడులో రాజకీయంగా భారీ శూన్యత ఉందని ఎఐఎడిఎంకె ప్రభుత్వ కార్యకలాపాలను ప్రజలు గమనిస్తున్నారని కమాండర్ విజయ్ రాజకీయ ఆరంగేట్రంకి ఇది సరైన సమయం అని ప్రజలందరు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు

భారతదేశంలోని అతి పిన్న వయస్కులైన రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒకరని. అలాగే, జగన్ విజయ్ వయస్సు కాబట్టి, జగన్ మాదిరే విజయ్ కూడా భవిష్యత్తులో తమిళనాడును శాసిస్తాడని. కమాండర్ విజయ్ తమిళనాడు జగన్ మోహన్ రెడ్డిగా మారి ముఖ్యమంత్రి అయి సుపరిపాలన అందిచాలి మా కోరిక అని తమ భావన వ్యక్తపరిచారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp