మోడల్ పట్టణాలుగా మారబోతున్న ఆ రెండు ప్రాంతాలు

By Kiran.G Aug. 05, 2020, 10:30 am IST
మోడల్ పట్టణాలుగా మారబోతున్న ఆ రెండు ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే రాజధాని వికేంద్రీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లాలోని తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వివరాల్లోకి వెళితే తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలను మోడల్ పట్టణాలుగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా ఈ రెండు ప్రాంతాలను రూ.1,173 కోట్లతో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలిదశలో భాగంగా ప్రభుత్వం రూ.20 కోట్లను పురపాలక శాఖకు మంజూరు చేసింది. ఈ రెండు ప్రాంతాల అభివృద్ధి కోసం సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక రూపకల్పన బాధ్యతలను ప్రభుత్వం అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌కు అప్పగించింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న అభివృద్ధి లో భవిష్యత్తులో ఈ ప్రాంతాల రూపురేఖలు మారిపోనున్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp